ఆ పాపం ఇద్దరిదీ : మైసూరారెడ్డి
టీ, ఏపీ ప్రభుత్వాలపై మైసూరా ధ్వజం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోవడంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాపమూ ఉందని మైసూరారెడ్డి శుక్రవారం దుయ్యబట్టారు. రాయలసీమకు కేటారుుంచిన నికర జ లాలు వచ్చేలా చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే రాయలసీమకు నీటి విడుదల సాధ్యం కాదని తెలిసీ.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 నుంచి 860 అడుగులకు పడిపోయేంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిందని చెప్పారు. రాయలసీమ పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్న మాటలన్నీ చిత్తశుద్ధి లేనివేనని మైసూరారెడ్డి విమర్శించారు.
రేపు ప్రాజెక్టు సందర్శన
వాస్తవాలు బహిర్గతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళుతుందని మైసూరారెడ్డి చెప్పారు.