
'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు'
హైదరాబాద్:లోక్సభలో వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. కావాలనే టీడీపీ నేతలు దగుల్బాజీ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.అవిశ్వాసానికి అవసరమైన మద్దతుకోసం కాంగ్రెస్-టీడీపీలు ఏరోజూ ప్రయత్నించలేదన్నారు. లోక్పాల్ బిల్లుకోసం అవిశ్వాసాన్ని వాయిదా వేయమని కోరామే తప్పా..ఉపసంహరించుకోలేదని మైసూరా తెలిపారు. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులని విమర్శించారు.టీడీపీ చేస్తున్న సిగ్గులేని రాజకీయాలను చేసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.