'తెలుగు ప్రజల బతుకుల్ని కాంగ్రెస్ ఛిద్రం చేసింది'
'తెలుగు ప్రజల బతుకుల్ని కాంగ్రెస్ ఛిద్రం చేసింది'
Published Fri, Feb 28 2014 6:17 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రెండుసార్లు అధికారమిస్తే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల బతుకుల్ని ఛిద్రం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉంది అని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పాలనకు కేంద్రం సిఫార్సు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలుగువారి మధ్య చిచ్చుపెట్టి ఇప్పుడు ప్యాకేజీల పేరుతో రకరకాల ప్రకటనలు చేస్తున్నారని మైసూరా విమర్శించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తుడిసిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. సోనియా పెట్టె, బేడా సర్దుకొని కొడుకుతో సహా ఇటలీకి పోయే దుస్థితి రాబోతుందని మైసూరారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో టీడీపీ మద్దతు వల్లే కాంగ్రెస్ పాలన ఇన్నాళ్లు సాగిందని, లేకపోతే ఎప్పుడో కూలిపోవాల్సిన ప్రభుత్వమిదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ నుంచి చాలామంది ఆసక్తి చూపారని.. అయితే ఖాళీ లేకనే టీడీపీలోకి వెళ్తున్నారని మైసూరారెడ్డి అన్నారు. చంద్రబాబు మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మైసూరారెడ్డి అన్నారు.
Advertisement