
సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపాం: మైసూరారెడ్డి
హైదరాబాద్: సమైక్యరాష్ట్ర ఉద్యమం కోసం సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపామని వైఎస్సార్ సీపీ నేత ఎం.వి మైసూరారెడ్డి తెలిపారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో చర్చ సాగిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఐక్యతకోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా అన్నారు. ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉన్నా, కలిసి ఉద్యమం చే్ద్దామనే కోణంలో చర్చించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ చర్చల్లో పాల్గొన్న బి.వి.రాఘవులు అనంతరం మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ బృందం కలిసి పనిచేద్దామని ప్రతిపాదించిదన్నారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపినట్లు రాఘవులు తెలిపారు.