
'ఆర్టికల్(3)ని దుర్వినియోగం చేస్తున్నారు'
హైదరాబాద్: ఆర్టికల్(3)ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీప నేత మైసూరా రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వెంటనే స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ (3)ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్(3)ని దుర్వినియోగం చేయడం ఫెడరల్(సమాఖ్య) స్పూర్తికి విరుద్దమన్నారు.
దీనికి సంబంధించి త్వరలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల ముఖ్య నేతలను కలుస్తామన్నారు. అనంతరం కోర్టు అనుమతి తీసుకుని మిగిలిన పార్టీ నేతలను రాష్ట్ర రాజధానులకు వెళ్లి కలుస్తామన్నారు.