బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. తనకు ఆరోగ్యం బాగా లేదని. అందుకోసం హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అమితాబ్‌కు కంటిలో శుక్లాలకు సంబంధించిన లేజర్ చికిత్స జరిగింది. తాజాగా ఆయన మరో కంటికి కూడా ఆపరేషన్ విజయవంతంగా పూరయ్యింది. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తెలిపారు. అంతేకాక ‘కంటిశుక్లం చాలా ముఖ్యమైనది. దీని విషయంలో ఎలాంటి ఆలస్యం చేసినా అది అంధత్వానికి దారితీస్తుంది. కాబట్టి ఆలస్యం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది’ అని సూచించారు బిగ్ బీ.
ఆపరేషన్ విజయవంతం అయిన విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడమే కాక.. తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ హిమాన్షు మెహతాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు బిగ్ బీ. ‘‘నా రెండో కంటికి చేసిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను.. బాగున్నాను. ఆధునిక వైద్య పరిజ్ఞానం.. డాక్టర్ మెహత హస్తవాసి వల్ల ఇది సాధ్యమయ్యింది. ఈ అనుభవం నా జీవితాన్ని మార్చేసింది. గతంలో మీరు చూడలేనిది ఇప్పుడు చూడవచ్చు. ఖచ్చితంగా అద్భుతమైన ప్రపంచం’ అని కొనియాడాతు ట్వీట్ చేశారు.
T 3842 - .. and the 2nd one has gone well .. recovering now ..
— Amitabh Bachchan (@SrBachchan) March 14, 2021
all good .. the marvels of modern medical technology and the dexterity of dr HM 's hands .. life changing experience ..
You see now what you were not seeing before .. surely a wonderful world !!
అమితాబ్ బచ్చన్ గత ఫిబ్రవరిలో మొదటిసారి కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ‘అభిమానుల ఆందోళన, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. ఈ వయస్సులో కంటి శస్త్రచికిత్స సున్నితమైనది. ఖచ్చితమైన సంరక్షణ అవసరం. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ బ్లాగ్‌లో తెలియజేశారు. శస్త్ర చికిత్స జరిగినందున టైపింగ్ చేయడం ఇబ్బందిగా ఉన్నది. టైపింగ్ తప్పులు జరిగితే క్షమించండి అని చివరన పేర్కొన్నారు బిగ్ బీ. ఇక అమితాబ్ గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. వికాస్ బల్ సినిమాలో ఆయన నటించాల్సి ఉంది. ఇదే కాక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా నటిస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment