
ట్రోఫీని ఆవిష్కరిస్తున్న మురళీ కార్తీక్, రత్నాకర్‌రాజు తదితరులు
ప్రశాంతి నిలయం: సత్యసాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత మానవతా విలువలను,సేవా స్ఫూర్తిని చాటుతూ ఆదర్శవంతమైన జీవితం సాగించాలని భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్’ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది.
మురళీ కార్తీక్‌తోపాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు తదితరులు ట్రోఫీని, క్రికెట్ లీగ్ పోటీల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment