National Cricket Selection
-
పుట్టపర్తిలో సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్
ప్రశాంతి నిలయం: సత్యసాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత మానవతా విలువలను,సేవా స్ఫూర్తిని చాటుతూ ఆదర్శవంతమైన జీవితం సాగించాలని భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్’ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. మురళీ కార్తీక్తోపాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు తదితరులు ట్రోఫీని, క్రికెట్ లీగ్ పోటీల బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. -
‘మా వేతనాలు కూడా పెంచండి’
న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ సెలక్షన్ కమిటీకి చెందిన సీనియర్, జూనియర్ సెలక్టర్లు తమ వేతనాలను పెంచాల్సిందిగా బీసీసీఐని కోరారు. దేశవాళీ క్రికెటర్లతో పాటు మ్యాచ్ అధికారుల వేతనాలను పెంచే ప్రయత్నంలో ఉన్నామని ఇటీవల బోర్డు పేర్కొంది. దీంతో సెలక్టర్లు తమ గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు సీజన్కు రూ.60 లక్షలు పొందుతున్నారు. అదే జూనియర్ ప్యానెల్ సభ్యులు ఏడాదికి రూ.40 లక్షల వేతనం తీసుకుంటున్నారు.