Kia EV6 Launched By Actress Katherine in Hyderabad - Sakshi
Sakshi News home page

Kia EV6: ఎలక్ట్రిక్ కియా.. ఆగయా: సినీ నటి క్యాథెరిన్‌, జానీ మాస్టర్‌ సందడి

Published Sat, May 28 2022 3:38 PM | Last Updated on Sat, May 28 2022 8:39 PM

Kia EV6 launched at Hyderabad by Actress Katherine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ కార్ల కంపెనీ కియా సరికొత్త పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం తొలిసారిగా మార్కెట్ లోకి వస్తోంది. త్వరలో వినియోగదారుల కు అందుబాటులో కి రానున్న ఈ కార్ ని హైదరాబాద్ లో ప్రదర్శించారు.
·
హైటెక్‌ సిటీ ప్రాంతంలో జరిగిన కియా ఈవీ6 ఆవిష్కరణ కార్యక్రమంలో  సినీ నటి క్యాథెరిన్‌, సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్‌ ; షోరూమ్‌ ప్రతినిధి చెన్న కేశవ– సీఓఓ,  జీఎం వరప్రసాద్‌  పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు.

ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 3లక్షల రూపాయల టోకెన్‌ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకో వచ్చు.  దేశవ్యాప్తంగా 100 మంది వినియోదారులకు  ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022లో విడుదల చేయనున్నట్టు కియా ప్రతినిధులు తెలిపారు.

ప్రత్యేకతలివీ...
ఈ కియా ఈవీ6ను ఈ–జీఎంపీ పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్‌,  అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2 డబ్ల్యుడీలో  ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్‌లో 325పీఎస్‌ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది.

కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు  ఉన్నాయి.  వెడల్పాటి ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, డ్రైవర్‌, ప్యాసెంజర్‌ రిలాక్సేషన్‌ సీట్లు, రిమోట్‌ ఫోల్డింగ్‌ సీట్లు, ఏఆర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు దీనిలో ఉన్నాయి.

కియా ఈవీ 6 వాహనం  మూన్‌స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూ –రంగుల లో లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement