BGMI Relaunched: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజీఎంఐ (బ్యాటిల్‍గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) గేమ్ ఎట్టకేలకు ఇండియాలో మళ్ళీ లాంచ్ అయింది. ఈ రోజు నుంచి గేమ్ మొదలైంది. బ్యాన్ అయిన సుమారు ఆరు సంవత్సరాల తరువాత ఈ గేమ్ మళ్ళీ భారతదేశంలో అడుగుపెట్టింది. దీనిని రీ-లాంచ్ చేయడానికి భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నుంచి అప్రూవల్ కూడా తీసుకుంది. కావున ఇప్పుడు లాంచ్ చేసింది.
ప్రారంభ దశగా మూడు నెలలు అనుమతి పొందుతూ ప్రస్తుతం గేమ్ లాంచ్ చేసింది. ఆ తరువాత పరిస్థిని బట్టి కొనసాగించడమా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ - కస్టమర్లకు పండగే!)
టైమ్ లిమిట్..
ఈ గేమ్ ఆడటానికి ఇప్పుడు డైలీ లిమిటెడ్ టైమ్ కేటాయించారు. కావున గేమ్ డౌన్‍లోడ్ చేసుకున్న తరువాత 48 గంటల లోపు దశల వారీగా యూజర్లు లాగిన్ అవ్వవచ్చు. డౌన్‍లోడ్ చేసుకున్న వారందరూ రెండు రోజుల్లోగా గేమ్ ఆడడం మొదలుపెట్టవచ్చని సమాచారం. యూజర్ల వయసుని బట్టి టైమ్ లిమిట్ ఉంటుంది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు రోజుకి 6 గంటల పాటు ఆడుకోవచ్చు. ఆరు గంటల తరువాత లాగిన్ అకౌంట్ నుంచి గేమ్ ఆడలేరు. మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఆడాలంటే ఆ తరువాత రోజే ఆడాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ కొన్న 'రూబిన్ సింగ్')
18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలు రోజుకి 3 గంటలు మాత్రమే ఈ గేమ్ ఆడుకోవచ్చు. అంతే కాకుండా ఆ వయసున్న పిల్లలు ఆడాలంటే పేరెంటర్ వెరిఫికేషన్ కూడా చాలా అవసరం. ఈ గేమ్ వెర్షన్‍లో నుసా అనే కొత్త మ్యాప్ కూడా యాడ్ అయ్యింది. జిల్‍లైన్స్, సూపర్ రీకాల్ ఫీచర్, టాక్టికల్ క్రాస్‍బో, టూ సీటర్ ఆఫ్ రోడ్ ఆల్ టెరిటరైన్ హెహికల్స్ కూడా గేమ్‍కు యాడ్ అయ్యాయి. కావున ఇది మునుపటికంటే చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాము.
No more waiting, play like your heroes in the Battlegrounds! 🎙#BGMI #battlegroundsmobileindia #IndiaKiHeartbeat pic.twitter.com/VbPIRiS18Z
— BattleGrounds Mobile India (@BattlegroundmIn) May 29, 2023
Comments
Please login to add a commentAdd a comment