సాక్షి, ముంబై: జర్మనీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ఎస్‌యూవీ మోడల్ ఎక్స్3లో ‘‘స్పోర్ట్‌ఎక్స్’’ పేరుతో పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 56.5 లక్షలుగా ఉంది. ఇందులో 252 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ కొత్త వేరియంట్ 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
దేశీయంగా చెన్నై ప్లాంట్‌లో తయారయ్యే ఈ కారు అమ్మకాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 28 లోపు ఆన్‌లైన్‌లో బుకింగ్స్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సర్వీస్ ప్యాకేజీతో పాటు రూ.1.50 లక్షల విలువైన ఉపకరణాలను ఉచితంగా పొందవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పాహా మాట్లాడుతూ ... బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 పరిధిని పెంచే ప్రణాళికల్లో భాగంగా పెట్రోల్ వేరయంట్‌లో స్పోర్ట్స్‌ఎక్స్ వేరియంట్‌ను విడుదల చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment