సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశారు. హైవేపై రెండు పులులు దర్జాగా నడిచి పోతున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆలోచింపజేసే పోస్టులు, ఫన్నీ వీడియోలే కాదు, నెటిజనులను ఆశ్చర్యపరిచే, వారికి ప్రేరణనిచ్చే వీడియోలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా తన తాజా పోస్ట్‌లో తన ఎస్‌యూవీ ప్రమోషన్ చేసుకున్నారు. ఈ వీడియోతో ఒక ఆసక్తికరమైన శీర్షికను కూడా యాడ్ చేశారు. ‘హైవేమీద మహీంద్ర ఎస్‌యూవీ ఒక్కటే టైగర్ కాదు.. ఇంకా బిగ్ కేట్స్ ఉన్నాయన్నమాట.. అద్భుతం’’ అంటూ కమెంట్ చేశారు.
ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ వీడియోపై ఎక్కడ ఎలా తీశారనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఆగస్ట్ 19న మహాబలేశ్వర్ సమీపంలోని పంచగని రహదారిపై పులులు కనిపించాయని ఈ వీడియో క్లిప్పింగ్‌లో పేర్కొన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. మహారాష్ట్ర, చంద్రపూర్‌లోని తడోబాలో తీసిన చాలాకాలం క్రితం నాటి వీడియో ఇదని వ్యాఖ్యానించారు.
అంతేకాదు కొంతమంది ప్రకృతి, పర్యావరణం, అడవుల ధ్వంసం, ఆయా భూభాగాలను ఆక్రమించడం లాంటి అంశాలపై నిరసనగా స్పందించారు. వాటి నివాసాలను మనం ఆక్రమించుకుంటున్నాం... ఎవరైనా మనల్ని అలా చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకోండి.. దయచేసి వాటి మానాన వాటిని అలా ఉండనివ్వండి అని కొందరు, పాపం తమ ఇల్లు ఏమైందని ఆశ్చర్యపోతున్నట్టున్నాయంటూ విచారం వ్యక్తం చేయడం విశేషం.
చదవండి: అత్తగారి అదిరిపోయే డాన్స్: చూస్తూ ఉండిపోయిన వధువు!
Seems like they are wondering what has become of their home.
— Bye Bye (@Sagar25687231) August 22, 2021
Road through jungle, then shabas, then hotels, then restaurants, then farmhouses, then waterparks.
The debate of environment v. entertainment is prolonged.
Comments
Please login to add a commentAdd a comment