Magnificent
-
చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశారు. హైవేపై రెండు పులులు దర్జాగా నడిచి పోతున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలోచింపజేసే పోస్టులు, ఫన్నీ వీడియోలే కాదు, నెటిజనులను ఆశ్చర్యపరిచే, వారికి ప్రేరణనిచ్చే వీడియోలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా తన తాజా పోస్ట్‌లో తన ఎస్యూవీ ప్రమోషన్ చేసుకున్నారు. ఈ వీడియోతో ఒక ఆసక్తికరమైన శీర్షికను కూడా యాడ్ చేశారు. ‘హైవేమీద మహీంద్ర ఎస్యూవీ ఒక్కటే టైగర్ కాదు.. ఇంకా బిగ్ కేట్స్ ఉన్నాయన్నమాట.. అద్భుతం’’ అంటూ కమెంట్ చేశారు. ఈ వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ వీడియోపై ఎక్కడ ఎలా తీశారనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఆగస్ట్ 19న మహాబలేశ్వర్ సమీపంలోని పంచగని రహదారిపై పులులు కనిపించాయని ఈ వీడియో క్లిప్పింగ్‌లో పేర్కొన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. మహారాష్ట్ర, చంద్రపూర్‌లోని తడోబాలో తీసిన చాలాకాలం క్రితం నాటి వీడియో ఇదని వ్యాఖ్యానించారు. అంతేకాదు కొంతమంది ప్రకృతి, పర్యావరణం, అడవుల ధ్వంసం, ఆయా భూభాగాలను ఆక్రమించడం లాంటి అంశాలపై నిరసనగా స్పందించారు. వాటి నివాసాలను మనం ఆక్రమించుకుంటున్నాం... ఎవరైనా మనల్ని అలా చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకోండి.. దయచేసి వాటి మానాన వాటిని అలా ఉండనివ్వండి అని కొందరు, పాపం తమ ఇల్లు ఏమైందని ఆశ్చర్యపోతున్నట్టున్నాయంటూ విచారం వ్యక్తం చేయడం విశేషం. చదవండి: అత్తగారి అదిరిపోయే డాన్స్: చూస్తూ ఉండిపోయిన వధువు! Seems like they are wondering what has become of their home. Road through jungle, then shabas, then hotels, then restaurants, then farmhouses, then waterparks. The debate of environment v. entertainment is prolonged. — Bye Bye (@Sagar25687231) August 22, 2021 -
MS Dhoni World Cup 2011: ఆ అద్భుతానికి దశాబ్దం!
‘ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ ఎ మాగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ద క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్’... రవిశాస్త్రి కామెంటరీ సగటు భారత క్రికెట్ అభిమాని చెవుల్లో ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం ఏప్రిల్ 2న ముంబై వాంఖడే మైదానం టీమిండియా గెలుపుతో హోరెత్తింది. ఉత్కంఠ, ఉత్సాహం, సంతోషం, భావోద్వేగం, ఆనంద భాష్పాలు... ఒకటేమిటి, ఇలా అన్ని రకాల భావనలు ఆ సమయంలో కనిపించాయి. అటు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకపోగా, అభిమానుల సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కులశేఖర వేసిన 49వ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా ధోని సిక్స్‌గా మలచిన షాట్ అందరి మనసుల్లో పదేళ్లుగా అలా ముద్రించుకుపోయింది. క్వార్టర్స్‌లో ఆసీస్‌ను, సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన జట్టు ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాకేమీ అనిపించడం లేదు: గంభీర్ ఫైనల్లో 97 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన గౌతం గంభీర్ మాత్రం భిన్నంగా స్పందిస్తూ... ‘మేం గెలిచి పదేళ్లయింది. గతం గురించి ఎక్కువగా గుర్తు చేసుకునే తత్వం కాదు నాది. ప్రపంచకప్ గెలిచి మేం ఎవరికీ ఎలాంటి మేలు చేయలేదు. మెగా టోర్నీ కోసం జట్టులోకి ఎంపికై నందుకు బాగా ఆడి గెలిచేందుకు ప్రయత్నించడం మా బాధ్యత. అభిమానులు సం తోషించారు. గర్వపడే క్షణం అనేది వాస్తవమే కానీ అతిగా చర్చించడం మాని భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. పదే పదే 1983, 2011 గురించే ఆలోచిస్తుంటే ఇక ముందుకు వెళ్లేదెప్పుడు’ అని అంటున్నాడు. చదవండి: ‘అంపైర్స్ కాల్’ కొనసాగింపు -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఇంటర్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు నా రూమ్‌లోనే పడింది. లాస్ట్‌లో నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కానీ, ధైర్యం సరిపోలేదు. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. త్రీ మంత్స్గా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నేను నల్లగా, లావుగా, మొటిమలతో ఉంటాను. అందుకే తను నా ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉంది సార్! ఏదైనా సలహా ఇవ్వండి. – కిరణ్ మై డియర్ కిరణ్ రూపం మనది కాదు. దేవుడిచ్చింది! ప్రేమ మనది. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు! ‘కొడుతుంది సార్!?’ వై నీలాంబరి? ‘అద్దంలో ముఖం చూసుకున్నావా మాడిన పనసపండు! అని ఛీ కొడుతుందేమో సార్!’ పనస తొనలు తిన్న వాళ్లు ఎవరూ పనసపండు అవుట్ సైడ్ చూసి డెసిషన్ తీసుకోరు! ‘పాపం! పసివాడు తన్నులు తింటాడేమో సార్?’ జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా...! ‘ప్రపోజ్ చేసినప్పుడు రెండు అరటిపండ్లు కూడా ఇవ్వమనండి సార్, అమ్మవారు చల్లారి యాక్షన్ తగ్గుతుంది. బీ కేర్‌ఫుల్ కిరణ్!’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
కర్షకబాంధవి కృష్ణమ్మ