నిస్సాన్‌ బంపర్‌ ఆఫర్‌..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..! | Nissan Offering Discount Of Up To Rs 1 Lakh On Kicks SUV | Sakshi
Sakshi News home page

Nissan: నిస్సాన్‌ బంపర్‌ ఆఫర్‌..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!

Published Sun, Dec 12 2021 1:11 PM | Last Updated on Sun, Dec 12 2021 2:51 PM

Nissan Offering Discount Of Up To Rs 1 Lakh On Kicks SUV - Sakshi

వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్‌ ఎండ్‌ కావడంతో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. కాగా ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్ కూడా ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్‌ కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2021 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.




నిస్సాన్‌ అందిస్తోన్న ఆఫర్స్‌ ఇవే..!
నిస్సాన్‌ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును.

కిక్స్‌ ఫీచర్స్‌
నిస్సాన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ పెట్రోల్‌ ఇంజన్‌తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి  1.3 లీటర్‌ టర్బో వేరియంట్‌ 154 బీహెచ్‌పీతో 254 ఎన్‌ఎమ్‌ టార్క్‌ని రిలీజ్‌ చేస్తుంది. రెండో వేరియంట్‌ అయిన 1.5 లీటర్‌ వేరియంట్‌ 105 బీహెచ్‌పీతో 142 ఎన్‌ఎం టార్క్‌ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్‌, 6 స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌లో లభిస్తున్నాయి. కిక్స్‌ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్‌లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్‌ తెలిపింది.

చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఎగబడుతున్న జనాలు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement