Nissan India Company
-
ఇయర్ ఎండ్ సేల్: పలు కార్ల కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
Year End Offers On Cars 2021: మీరు కారు కొనాలనుకుంటున్నారా..! అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. నిస్సాన్, మహీంద్రా, హోండా, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులు ఇయర్ ఎండ్సేల్ను ప్రకటించాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుబాటుకానున్నాయి. ఇయర్ ఎండ్ సేల్ భాగంగా పలు కార్లపై ఆయా కంపెనీలు అందిస్తోన్న ఆఫర్లు..! రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ ఇండియా ఈ నెలలో డస్టర్ ఎస్‌యూవీపై గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 50 000 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, రూ. 50వేల వరకు నగదు తగ్గింపు, రూ. 30 వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కొనుగోలుదారులు పొందవచ్చును. కంపెనీ reli.ve స్క్రాప్‌పేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. మహీంద్రా అల్టురాస్ G4 మహీంద్రా అల్టురాస్ G4 ఎస్యూవీ కొనుగోలుపై మహీంద్రా రూ. 81, 500 వరకు తగ్గింపులను ప్రకటించింది. ఇందులో రూ. 50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఇతర ఆఫర్లను కొనుగోలుదారులకు మహీంద్రా ప్రకటించింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ కొనుగోలుపై గరిష్టంగా రూ. 50వేల వరకు తగ్గింపును పొందవచ్చును. ఈ ఆఫర్స్ టర్బో వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఇతర పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రూ.25,000 వరకు తగ్గింపులను పొందవచ్చును. స్పోర్ట్జ్ పెట్రోల్ DT వేరియంట్‌పై ఏలాంటి ప్రత్యేక ఆఫర్లు లేవు. సీఎన్జీ మోడల్స్‌పై రూ.17,300 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ హోండా సిటీ కారుపై హోండా ఇండియా పలు ఆఫర్లను ప్రకటించింది. ఐదోవ తరం హోండా సిటీ సెడాన్‌పై గరిష్టంగా రూ. 45,108 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్స్ అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. ఇందులో రూ. 7,500 వరకు నగదు తగ్గింపు లేదా రూ. 8,108 వరకు ఎఫ్ఓసీ ఉపకరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా రూ. 15,000 ఎక్సేచేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా రూ. 5,000 లాయల్టీ బోనస్, రూ. 9,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. చదవండి: 20 కోట్ల సార్లు కాల్స్..! 6 లక్షల 64 వేల మందికి నరకం చూపించిన ఒకే ఒక్క నెంబర్..! -
నిస్సాన్ బంపర్ ఆఫర్..! కారు కొనుగోలుపై రూ. లక్ష వరకు తగ్గింపు..!
వచ్చే ఏడాది నుంచి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పలు వాహనాల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా కార్ల ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇయర్ ఎండ్ కావడంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. కాగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ కొనుగోలుపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2021 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. నిస్సాన్ అందిస్తోన్న ఆఫర్స్ ఇవే..! నిస్సాన్ మిడ్-సైజ్ ఎస్యూవీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది. 1.3 లీటర్ టర్భో పెట్రోల్ వెర్షన్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 70 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. కాగా 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ , రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ రెండు వెర్షన్లపై కొనుగోలుదారులకు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 5,000 ఆన్లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా పొందవచ్చును. కిక్స్ ఫీచర్స్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ పెట్రోల్ ఇంజన్‌తో రెండు వెర్షన్లలో లభిస్తోంది. ఇందులో ఒకటి 1.3 లీటర్ టర్బో వేరియంట్ 154 బీహెచ్పీతో 254 ఎన్ఎమ్ టార్క్‌ని రిలీజ్ చేస్తుంది. రెండో వేరియంట్ అయిన 1.5 లీటర్ వేరియంట్ 105 బీహెచ్పీతో 142 ఎన్ఎం టార్క్‌ని ఇస్తుంది. ఇక రెండు వేరియంట్లలో 5 స్పీడ్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్‌లో లభిస్తున్నాయి. కిక్స్ ధర ప్రస్తుతం ఇండియాలో ప్రారంభం రూ. 9.5 లక్షల నుంచి గరిష్టంగా 14.65 లక్షల రేంజ్లో లభిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు, డీలర్లను బట్టి ఆఫర్లో కొంత తేడాలు ఉండవచ్చని నిస్సాన్ తెలిపింది. చదవండి: రూ. 50 చెల్లిస్తే ఎలక్ట్రిక్ బైక్..! ఎగబడుతున్న జనాలు..! -
నిస్సాన్ ‘రెడ్ వీకెండ్స్’ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా తాజాగా ‘రెడ్ వీకెండ్స్’ పేరిట సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా నిస్సాన్ కిక్స్ కారు కొనుగోలుపై రూ.1.15 లక్షల మేర ప్రయోజనాన్ని ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 40000, ఎక్సే్ఛంజ్ డిస్కౌంట్ రూ. 40000, కార్పొరేట్ డిస్కాంట్ రూ. 10000, వారెంటీ విలువ రూ. 20500 ఉన్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ మోడల్‌తో పాటు డాట్సన్ కార్లను కేవలం 6.99 శాతం వడ్డీ రేటుకే అందిస్తున్నట్లు వెల్లడించారు. -
నిస్సాన్ మైక్రా.. లిమిటెడ్ ఎడిషన్
నిస్సాన్ ఇండియా కంపెనీ మైక్రా మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ మైక్రా ఎక్స్-షిఫ్ట్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిందీ సినిమా నటి కంగనా రనౌత్. అంతర్జాతీయంగా ఈ మైక్రా కారును మార్కెట్లోకి తెచ్చి ఐదేళ్లైన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని, 750 కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఈ కంపెనీ మైక్రా సీవీటీ ఆటోమేటిక్ హ్యాచ్‌బాక్ వేరియంట్(ధరలు రూ.6.39-6.67 లక్షలు)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు మైలేజీ 19.3కిమీ.ని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. -
నిస్సాన్ కొత్త సన్నీ
పెట్రోల్ కార్ల ధరలు రూ.7.29-రూ.9.29 లక్షలు డీజిల్ కార్ల ధరలు రూ. 8.33- 10.02 లక్షలు ముంబై: నిస్సాన్ ఇండియా కంపెనీ సన్నీ మోడల్లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ సన్నీ కారును మూడు పెట్రోల్, ఐదు డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అండీ పామర్ చెప్పారు. పెట్రోల్ కార్ల ధరలు రూ.7.29 లక్షల నుంచి రూ.9.29 లక్షల రేంజ్లో, డీజిల్ కార్లు రూ.8.33 లక్షల నుంచి రూ.10.02 లక్షల రేంజ్లో ఉన్నాయని(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై) వివరించారు. పెట్రోల్ వేరియంట్లు 17 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్లు 22.7 కి.మీ మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకతలు... ఈ కొత్త సన్నీ కారులో బూమరాంగ్ షేప్ హెడ్‌ల్యాంప్స్, కొత్తగా ఫాగ్ ల్యాంప్స్, అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, 12-స్పోక్ వై-ప్యాటర్న్ అలాయ్ వీల్స్, రీ డిజైన్ చేసిన డాష్‌బోర్డ్, పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ప్రీమియం ఆడియో సిస్టమ్(వెనక ఉండే పార్కింగ్ కెమెరాకు ఇది డిస్ప్లేగా పనిచేస్తుంది), ఆడియో, టెలిఫోన్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త ప్రీమియం స్టీరింగ్ వీల్, వెనక కూర్చునే ప్రయాణికుల కోసం ఎయిర్ బ్లోయర్, రీడింగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్, వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. సన్నీ కారును నిస్సాన్ 2011లో మార్కెట్లోకి తెచ్చింది.