
మహీంద్రా వాహన ధరలు తగ్గాయ్..
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా’ తాజాగా తన యుటిలిటీ వెహికల్స్, ఎస్‌యూవీల ధరలను 6.9 శాతం వరకు తగ్గించింది.
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా’ తాజాగా తన యుటిలిటీ వెహికల్స్, ఎస్‌యూవీల ధరలను 6.9 శాతం వరకు తగ్గించింది. చిన్న కార్ల విభాగంలోని వాహన ధరల్లో సగటున 1.4 శాతంమేర కోత విధించింది. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీ అలాగే చిన్న వాణిజ్య వాహన ధరలను సగటున 1.1 శాతంమేర, తేలికపాటి, భారీ వాణిజ్య వాహన ధరలను సగటున 0.5 శాతంమేర తగ్గించింది. ఇక హైబ్రిడ్ వాహన ధరలను స్వల్పంగా పెంచింది. సవరించిన ధరలు ప్రాంతాన్ని బట్టి మారతాయని కంపెనీ పేర్కొంది. ట్రాక్టర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.