న్యూయార్క్ : మామకు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుదామని సర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లుడు పొరపాటున మామ చేతిలోనే మరణించిన విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగుచూసింది. మామ డెన్నిస్ 61వ జన్మదినం సందర్భంగా అభినందనల్లో ముంచెత్తాలని నార్వే నుంచి ఏకంగా 4500 మైళ్లు దాటి వచ్చిన క్రిష్టఫర్ బెర్గాన్ ఇంటి వెనుక గేటు నుంచి లోపలికి దూకి సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాడు. తమ ఇంటి బ్యాక్‌డోర్ వద్ద అలికిడి విన్న డెన్నిస్ ఎవరో లోపలికి దూకారని భయపడి కాల్పులు జరిపాడు. తుపాకీ గుళ్లు నేరుగా బెర్గాన్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తాను షూట్ చేసింది తన అల్లుడినేనని తెలుసుకున్న డెన్నిస్ వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయగా అప్పటికే మరణించినట్టు వారు నిర్ధారించారు. డెన్నిస్ పొరపాటున ఈ పనిచేయడంతో అతనిపై నేరాభియోగాలు మోపబోమని ఇది విషాద ఘటనని అధికారులు పేర్కొన్నారు. నార్వే పౌరుడైన బెర్గాన్ తన భార్యతో కలిసి స్వదేశంలో స్ధిరపడే ముందు పలు సంవత్సరాలు ఫ్లోరిడాలో ఉన్నారు. మరోవైపు జరిగిన ఘటనతో డెన్నిస్ కుటుంబం విషాదంలో మునిగింది.
Comments
Please login to add a commentAdd a comment