Macedonia
-
పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్
లిస్బన్: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించేందుకు పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లలో ఖతర్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత పొందింది. బుధవారం జరిగిన యూరోపియన్ జోన్ ప్లే ఆఫ్ ఫైనల్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ సొంతం చేసుకుంది. పోర్చుగల్ తరఫున బ్రూనో ఫెర్నాండెజ్ (32వ, 65వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. రొనాల్డోకిది వరుసగా ఐదో ప్రపంచకప్ కానుంది. మరో ప్లే ఆఫ్ ఫైనల్లో పోలాండ్ 2–0తో స్వీడన్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ నుంచి ఘనా, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, కామెరూన్ జట్లు కూడా ప్రపంచకప్ బెర్త్‌లు సంపాదించాయి. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి. జూన్ 14న జరిగే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల అనంతరం మిగిలిన ఐదు బెర్త్‌లు ఖరారవుతాయి. మిగిలిన ఐదు బెర్త్‌ల కోసం రేసులో ఉన్న జట్లతో కలిపి శుక్రవారం ప్రపంచకప్ ‘డ్రా’ను విడుదల చేయనున్నారు. -
సినిమాను తలపించే 'తొలిప్రేమ' కథ
ఇదో ఖండాంతర 'తొలిప్రేమ' కథ. ఆమె.. ఇరాక్ నుంచి శరణార్థిగా వలస వెళ్లిన ముస్లిం యువతి. అతను మెసిడోనియాకు చెందిన క్రిస్టియన్ పోలీస్ ఆఫీసర్. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మెసిడోనియాలో ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఈ ప్రేమకథ ఎలా మొదలైందంటే.. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో దియాల ప్రాంతంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అక్కడి కల్లోల పరిస్థితుల మధ్య జీవించలేక దియాలకు చెందిన 20 ఏళ్ల నూర అర్కవాజీ కుటుంబం దేశం విడిచి యూరప్‌కు వలస వెళ్లాలని నిర్ణయించుకుంది. గతేడాది మార్చిలో నూర, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఇతర శరణార్థులతో కలసి మెసిడోనియా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్నవారిలో బాబి డొడెవ్స్కీ అనే అధికారికి మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడటం తెలుసు. శరణార్థుల సమస్యల తెలుసుకుని వారికి సాయం చేస్తుంటాడు. ఆ రోజే నూర, బాబి మధ్య తొలిసారి చూపులు కలిశాయి. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పలు భాషలు మాట్లాడే నూర.. బాబితో మాట కలిపింది. కొన్ని రోజుల్లోనే ఇద్దరూ సన్నిహితమయ్యారు. కలసి జీవించాలని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల ఆమోదంతో గతేడాది జూన్‌లో ఇద్దరూ ఒక్కటయ్యారు. నూర ప్రస్తుతం బాబితో కలసి మెసిడోనియాలోని కమనోవోలో ఉంటోంది. కాగా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఆశ్రయం ఇచ్చిన జర్మనీకి వెళ్లిపోయారు. 15 ఏళ్లుగా పోలీస్ అధికారిగా బాబి పనిచేస్తున్నాడు. అంతేగాక ప్రొఫెషనల్ డాన్సర్. అతని డాన్స్ ట్రూప్ ప్రపంచమంతా పర్యటిస్తుంటుంది. మెసిడోనియాలో నివసించడానికి త్వరగా అలవాటుపడ్డానని నూర చెబుతోంది. ఈ దేశం, పట్టణం, ప్రజలు నన్ను శరణార్థిగా భావించరని, వారిలో ఒకరిలా కలసిపోయానని సంతోషం వ్యక్తం చేసింది. నూరను పెళ్లి చేసుకున్నందుకు చాలామంది ఆశ్చర్యపోయారని బాబి చెప్పాడు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకోవడమే దీనికి కారణమని అన్నాడు. ఇద్దరూ ఒకరి పేర్లను మరొకరు టాటూలు వేయించుకున్నారు. వీరి బంధం జీవితాంతం కొనసాగాలిన కోరుకుందాం. -
ఏమిటబ్బా..
మేసిడోనియా: భూమండలం రహస్యాలను తెలుసుకునేందుకు, అపార సహజ సంపదలను కొల్లగొట్టేందుకు అంతరిక్ష జీవులను తీసుకొచ్చిన విచిత్ర వాహనంలా ఉంది కదూ. నిజానికి ఇది అత్యంత అరుదైన మేఘం. వాతావరణంలో సంభవించే అసాధారణ మార్పుల కారణంగా విచిత్ర ఆకారంలో, భిన్న రంగుల్లో ఇలా భారీ మేఘాలు ఏర్పడుతాయి. మేసిడోనియా దేశంలోని గెవ్జీలియా నగరంలో గత బుధవారం రాత్రి కనిపించిందీ దృశ్యం. -
24 గంటల్లో 19 దేశాలు..
వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. వీరు ముగ్గురు అది సాధించి చూపారు. 24 గంటల్లో 19 దేశాలు తిరిగొచ్చేశారు. తద్వారా ప్రపంచ రికార్డును సాధించారు. ఈ టూర్‌కు ఉన్న నిబంధనలు మూడే. ఒకటి.. ప్రతి దేశంలో కాలుమోపాలి, రెండు.. 24 గంటల వ్యవధిలో అన్ని దేశాలను తిరిగిరావాలి, మూడు.. తిరిగామన్న దానికి మీడియాపరమైన ఆధారం ఉండాలి. ఈ రికార్డు సాధన కోసం నార్వేకు చెందిన గున్నార్ గార్ఫోర్స్, టే యంగ్, ఓస్టీన్లు సెప్టెంబర్ 22న అర్ధరాత్రి గ్రీస్ నుంచి బయలుదేరారు. వాయవ్య మార్గంలో ప్రయాణిస్తూ 24 గంటల వ్యవధిలో బల్గేరియా, మెసడోనియా, కొసోవో, సెర్బియా, క్రొయేషియా, బోస్నియా, స్లొవేనియా, ఆస్ట్రియా, హంగేరి, స్లొవాకియా, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, లీక్టన్స్టైన్ దేశాలు తిరిగొచ్చేశారు. వాతావరణం అనుకూలించలేదట.. లేకుంటే ఇటలీలోనూ అడుగుపెట్టేసి.. 24 గంటల్లో 20 దేశాలు తిరిగొచ్చేసేవాళ్లమని వీరు చెబుతున్నారు. మెసడోనియా నుంచి సెర్బియాకు వెళ్లడానికి.. ఆస్ట్రియా నుంచి జర్మనీకి వెళ్లడానికి వీళ్లు విమానమెక్కారు. మిగతా ప్రయాణమంతా అద్దె కార్లలోనే సాగించారు. ఖానాపీనా అంతా కార్లలోనే.. కొన్నిసార్లు మూత్రానికి వెళ్లే టైమ్ కూడా దొరికేది కాదట. దాంతో బాటిల్స్‌లోనే కానిచ్చేసేవారట! మొత్తానికి ఏదైతేనేం.. ప్రపంచ రికార్డును(గత రికార్డు 17 దేశాలు) బద్దలుకొట్టేశారు.