అట్టాల కంపెనిలో అగ్నిప్రమాదం | fire accident in a company | Sakshi
Sakshi News home page

అట్టాల కంపెనిలో అగ్నిప్రమాదం

Published Fri, Feb 20 2015 12:00 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in a company

హైదరాబాద్ క్రైం: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లి పరిధిలోని ఉమానగర్‌లో చోటుచేసుకుంది. గురువారం రాత్రి స్థానిక పాత ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ఉన్న అట్టాల కంపెనిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో పాటు విద్యుత్ అంతరాయం కలగడంతో ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement