
అశోక్ లేలాండ్‌కు రూ.476 కోట్ల లాభం
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ మార్చి క్వార్టర్లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ రూ.476 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విక్రయాలు భారీగా పుంజుకోవడం, నిర్వహణ వ్యయాలు తగ్గడం లాభాలకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.141 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
ఆదాయం 13% వృద్ధితో రూ.6,237 కోట్ల నుంచి రూ.7,057 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 3 రెట్లు పెరిగి రూ.1,223 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో లాభం కేవలం రూ.390 కోట్లే. ఆదాయం 7% పెరిగి రూ.21,332 కోట్లుగా నమోదైంది.