
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్‌కు భారీ ఆర్డర్లు దక్కాయి. చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, చండీగఢ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్‌ల నుంచి ఆర్డర్లు లభించాయని అశోక్ లేలాండ్ తెలిపింది.
ఈ సంస్థల నుంచి మొత్తం 2,580 బస్సులకు ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఎమ్‌డీ, వినోద్ కె దాసరి వివరించారు. ఈ బస్సులను మరో రెండు నెలల్లో డెలివరీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, నవకల్పనలతో బస్సులను తయారు చేయడం వల్ల భారత బస్సు మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment