సాక్షి,చెన్నై: భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ ఆర్డ్‌ర్‌ను తన ఖాతాలో వేసుకుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనుంచి ఈ ఆర్డర్‌ను సాధించింది. బస్సుల రూపకల్పనకుగాను రూ. 321 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. తమిళనాడులో 2,100 బస్సుల సరఫరా కోసం ఈ ఆర‍్డర్‌నుసాధించామని హిందూజ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అశోక్ లేలాండ్ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2వేల పాసింజర్ వాహనాలకు ఆధారమైన లోహపు చట్రాలను, పూర్తిగా నిర్మించిన 100 చిన్న బస్సులను సరఫరా చేయనున్నా మని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం నాటికి సరఫరా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దీంతో అశోక్ లేలాండ్ షేర్లు 1.54 శాతం లాభాలను నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment