tamilnadu buses
-
అశోక లేలాండ్ చేతికి భారీ ఆర్డర్
సాక్షి,చెన్నై: భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ ఆర్డ్ర్ను తన ఖాతాలో వేసుకుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనుంచి ఈ ఆర్డర్‌ను సాధించింది. బస్సుల రూపకల్పనకుగాను రూ. 321 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. తమిళనాడులో 2,100 బస్సుల సరఫరా కోసం ఈ ఆర్డర్నుసాధించామని హిందూజ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అశోక్ లేలాండ్ బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2వేల పాసింజర్ వాహనాలకు ఆధారమైన లోహపు చట్రాలను, పూర్తిగా నిర్మించిన 100 చిన్న బస్సులను సరఫరా చేయనున్నా మని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం నాటికి సరఫరా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దీంతో అశోక్ లేలాండ్ షేర్లు 1.54 శాతం లాభాలను నమోదు చేశాయి. -
కర్ణాటకకు బస్సు సర్వీసులు రద్దు
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటకలో రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తమిళ నాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు వెళ్లే అన్ని రకాల బస్సులను నిలిపివేసింది. ఆందోళనకారులు బస్సులపై దాడి చేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో జయలలిత సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చెన్నైలోని కోయంబేడులో బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ఇక మరి కొన్ని బస్సులను హోసూర్ సరిహద్దులో నిలిపివేశారు. మరోవైపు కర్ణాటక మాండ్యాలో ఆందోళనలు విస్తరిస్తున్నాయి. రైతులకు మద్ధతుగా ఇతర వర్గాలు నిరసనబాట పడుతున్నాయి. తాజాగా లాయర్లు కూడా ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించిన న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐతే ఈ ర్యాలీలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నారు. కొంతమంది నిరసనకారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోస్టర్లను చింపేయడం కలకలం రేపింది. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమత్రి సిద్ధరామయ్య ఈ రోజు సాయంత్రం అఖిలపక్షంతో సమావేశం కానున్నారు. -
ఆ బస్సులను రానిచ్చేది లేదు
-
ఆ బస్సులను రానిచ్చేది లేదు
శేషాచలం ఎన్కౌంటర్ ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ఎక్కువవుతున్నాయి. తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు జరుగుతుండటం, దాంతో ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేయడం తెలిసిందే. అయితే.. ఇప్పటికీ తమిళనాడు బస్సులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట తమిళనాడు బస్సులను ఏపీ గ్రామాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ చాలా రోజుల నుంచి తమిళనాడుకు వెళ్లే సర్వీసులను రద్దుచేసింది. దాంతో సంస్థకు ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే మరోవైపు తమిళనాడు బస్సులు మాత్రం ఎంచక్కా తిరుగుతూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాయి. దాంతో వరదాయపాళెం గ్రామస్థులు మండిపడ్డారు. తమిళనాడు బస్సులను తమ పొలిమేరలు దాటనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పోలీసుస్టేషన్లో కూడా చెప్పారు. తమ ప్రాంతానికి వస్తే వాటిని అడ్డుకోవడం ఖాయమని తేల్చిచెప్పారు. సోమవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు బస్సులను తిరగనివ్వబోమని అన్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోంది.