అశోక్ లేలాండ్ లాభం 71 శాతం జూమ్..
న్యూఢిల్లీ: జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో హిందుజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ అదిరిపోయే లాభాలను నమోదు చేసింది. 71 శాతం అధికంగా రూ.294.41 కోట్ల స్టాండలోన్ లాభాన్ని కంపెనీ ఆర్జించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.172 కోట్లుగా ఉంది. ఈ మేరకు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో రూ.5,274 కోట్లుగా ఉండగా, తాజాగా అది 7 శాతం తగ్గి రూ.4,911 కోట్లకు పరిమితం అరుుంది.
విదేశీ మారక ద్రవ్యం రూపంలో కంపెనీకి రూ.6.56 కోట్లు కలిసివచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జారుుంట్ వెంచర్లు, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడుల వల్ల రూ.157 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. సానుకూల ఫలితాలతో బీఎస్‌ఈలో అశోక్‌లేలాండ్ షేరు మంగళవారం 2 శాతానికిపైగా లాభంతో రూ.91.75 వద్ద క్లోజరుుంది.