కడ వరకూ కలసి ఉండాలనుకుంటున్నారా?
సెల్ఫ్‌చెక్
నేను బతికున్నంతకాలం నీతోనే జీవించాలని ఉంది... ఇలా చెప్పటం పెళ్లైన కొత్తలోనే కాదు, ఆ మాటను నిజం చేయటానికి చాలామంది ప్రయత్నిస్తారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అంకిత భావంతో, అవ్యాజమైన ప్రేమతో జీవితాంతం కలసిమెలసి ఉంటే ఎంత ఆనందం! అలాంటివారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. దాదాపు అర్ధశతాబ్ద కాపురంలో జీవితభాగస్వాములిద్దరూ ఎన్నో అనుభవాలను చవిచూస్తారు. పండు వయసు వచ్చేదాకా ఒకరికోసం ఒకరు బతుకుతూ అమృత ప్రేమను ఆస్వాదిస్తారు. ఇది నిజంగా గొప్ప విషయం. మీరూ మీ జీవితభాగస్వామితో చివరి క్షణం వరకు కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? మీ వార్ధక్య దశలో కూడా తోడునీడల్లా ఉండాలని ఆశపడుతున్నారా?
1. ఒంటరిగా ప్రయాణం చేయవలసినప్పుడు, మీ జీవితభాగస్వామి మీకు తోడుగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
2. మీకు తెలియకుండానే మీ లైఫ్‌పార్ట్‌నర్‌లోని కొన్ని అలవాట్లను సొంతం చేసుకొన్నారు.
ఎ. అవును బి. కాదు
3. మీ భార్య/భర్త లేకుండానే మీరు సంతోషంగా జీవించగలరని చెప్పగలరు.
ఎ. కాదు బి. అవును
4. కొన్ని పరిస్థితులవల్ల మీ లైఫ్‌పార్ట్‌నర్ మీకు దూరం కావలసివస్తే... ఎవరైనా (పిల్లలు, తల్లిదండ్రులు మొదలైనవారు) మీకు తోడుగా ఉంటే సరిపోతుందనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
5. అన్యోన్యంగా ఉన్న జంటలను చూస్తే మీకు అసూయ కలుగుతుంది. మీకన్నా వారే సంతోషంగా ఉన్నారనిపిస్తుంది.
ఎ. కాదు బి. అవును
6. మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని నమ్ముతారు. దాపరికం లేకుండా ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
7. శారీరకంగా, మానసికంగా మీ జీవితభాగస్వామిపై ఆధారపడి ఉన్నారు.
ఎ. అవును బి. కాదు
8. మీ కాపురంలో ఒకరినివిడిచి మరొకరు ఉన్నకాలం చాలా తక్కువ.
ఎ. అవును బి. కాదు
9. మీ జీవితభాగస్వామి మనసును కష్టపెట్టటం మీకు ఇష్టం ఉండదు. మీ గురించి కంటే మీ లైఫ్‌పార్ట్‌నర్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు.
ఎ. అవును బి. కాదు
10. గొడవలు మీ కాపురాన్ని కూలదోస్తాయని మీరు నమ్ముతారు.
ఎ. కాదు బి. అవును
‘ఎ’ లు ఏడు దాటితే మీ జీవితభాగస్వామిని ప్రాణంగా చూసుకుంటారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. చివరి వరకు వారి వెంటే ఉండాలని కోరుకుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే జీవితభాగస్వామిపై మీకు పెద్దగా ప్రేమ ఉండదు. ఇద్దరి మధ్య గొప్ప రిలేషన్ ఉండదు. ఒకరికోసం ఒకరు జీవించాలనుకోరు.