శృంగార కోరికల్లో స్పష్టత.. భాగస్వామి ఎంపికలో నవ్యత | Is 2024 truly the Year of the Self | Sakshi
Sakshi News home page

శృంగార కోరికల్లో స్పష్టత.. భాగస్వామి ఎంపికలో నవ్యత

Published Tue, Dec 19 2023 9:18 PM | Last Updated on Tue, Dec 19 2023 9:22 PM

Is 2024 truly the Year of the Self - Sakshi

వ్యక్తిగత ప్రాధాన్యతపై దృష్టి సారిస్తున్నారు. అందుకే డేటింగ్‌  పరంగా 2024 సంవత్సరం ’ ఇయర్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ ’( ’స్వీయ సంవత్సరం’) గా  పరిగణన పొందనుంది.  తాము ఎక్కువగా దేనికి  విలువ నిస్తున్నారు తామేమి  కోరుకుంటున్నారు? అనేది  డేటింగ్, బంధాలలో కీలకం కానుంది అని మహిళల  తొలి డేటింగ్‌ యాప్‌ బంబుల్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 డేటింగ్‌ శైలులు ఎలా ఉండబోతున్నాయ్‌?  సింగిల్స్‌ ఎలా డేటింగ్‌ చేయనున్నారు? డేటింగ్‌కు సంబంధించి భాగస్వాముల పట్ల మారుతున్న ఆశలు, అంచనాలు ఏమిటి?.. తదితర  డేటింగ్‌ ధోరణులను అధ్యయనం చేసింది. ఆ అధ్యయన ఫలితాల ప్రకారం...

►83% మంది మహిళలు ఇప్పుడు ఉన్నవారితో మరింత సంతోషంగా ఉండటానికి వీలుగా అడుగులు వేస్తున్నారు
►70% మంది సామాజిక సమస్యలపై చురుకుగా పాల్గొనే వారి పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.
►ఈ తరం విలువల గురించి మాట్లాడతారు అయితే శృంగారం విషయానికి వస్తే వారు కోరుకున్నదానిని పొందడానికి అవసరమైన మార్గాన్ని అనుసరించడానికి ఏ మాత్రం సందేహించరు.  
►అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో సగానికి పైగా (59%) తమ సంతోషభరిత శృంగార జీవితాలకు ఏం కావాలి? అనే విషయంలో స్పష్టమైన థృక్పధంతో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నారని తేల్చింది.
►అత్యధికులు (84%) తమను తాము మెరుగుపరుచుకునే మార్గాలను నిరంతరం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు.
►అలాగే 63% మంది తమ గురించి  తాము జాగ్రత్త తీసుకోని వారిని తమ భాగస్వామిగా అనర్హులని భావిస్తున్నారు.
►సింగిల్స్‌లో 83% మంది  నిరంతరం స్వీయ అభివృద్ధికి (సెల్ఫ్‌ బెటర్‌మెంట్‌)కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు  ఇప్పుడు ఉన్న వారితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

►61% మంది తమను  మార్చడానికి ప్రయత్నించని వ్యక్తులతో మాత్రమే డేటింగ్‌ చేస్తామంటున్నారు.  
►44% మందికి సామాజిక అంచనాలే   స్వీయ అభివృద్ధిని కోరుకునేలా చేస్తున్నాయి , ఆ తర్వాత స్వీయ–ఎదుగుదల కోరిక (38 %), వ్యక్తిగత అభద్రతలు తల్లిదండ్రుల అంచనాలు (రెండూ 37%), తిరస్కరణ భయం (35%), బాహ్య పోలికలు (28%), మునుపటి సంబంధాల అనుభవాలు (27%) ఉంటున్నాయి.
►భాగస్వామితో కలిసి గందరగోళ సంస్కృతి (  హస్టిల్‌ కల్చర్‌)  కన్నా నెమ్మది అయిన జీవితం (  ‘స్లో లైఫ్‌’) ఇష్టమని  53% మంది చెప్పారు.
►70% మంది వ్యక్తులు సామాజిక సమస్యలపై చురుకుగా పాల్గొనే వారి పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.  
►73% మందికి శ్రద్ధ వహించడమే కాకుండా, సామాజిక కారణాలు  సమస్యలలో చురుకుగా పాల్గొనడం కూడా ముఖ్యమే.

►64% మంది  సామాజిక కారణాలు (న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైనవి) గురించి పట్టించుకోరు,
►68%కి వారి  భాగస్వామి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

►58% మంది మహిళలు భిన్నమైన రాజకీయ ఆలోచనలు కలిగిన వారి పట్ల  తక్కువగా ఓపెన్‌ అవుతున్నారు,  
►డేటింగ్‌ విధానంలో కొన్ని అనూహ్యమైన మార్పుల్ని మనం చూడబోతున్నాం. వ్యక్తిగత సంబంధాలతో పాటు సామాజిక సమస్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి అని బంబుల్స్‌ ఇండియా కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ సమర్పిత సమద్ధర్‌ అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement