
సాక్షి,డెహ్రాడూన్: ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయాన్ని శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కేదార్‌పురి టౌన్‌షిప్‌ను ప్రారంభించి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. దివాళీ తర్వాత రోజు కేదార్‌నాథ్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని కోట్లాది ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం మరువలేనిదన్నారు. 2022 నాటికి నవ భారత్‌ను ఆవిష్కరించేందుకు తాను పునరంకితమయ్యానన్నారు. ఈ బృహత్తర యజ్ఞానికి భోలే బాబా ఆశీస్సులు కోరానన్నారు. 2013 వరదల్లో దెబ్బతిన్న పలు నిర్మాణాల పునరుద్ధరణకు ఈ సందర్భంగా ప్రధాని శంకుస్ధాపనలు చేశారు.
కేదార్‌నాథ్‌లో ఆది శంకరాచార్య సమాధి పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్ధాపన చేశారు.అంతకుముందు డెహ్రాడూన్ చేరుకున్న ప్రధానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, సీఎం రావత్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.