సిమ్లా : ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రధాని సమీక్షించనున్నారు.
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి కావడం గమనార్హం. కాగా, 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు. తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్ బోర్డర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్ బోర్డర్‌లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment