
సినియర్ నటి, ప్రముక భరతనాట్య కళాకారిణి శోభన పొగమంచులో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు. కేదార్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్న ఆమె అక్కడి వాతావరణం గురించి చెబుతూ ఓ వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంది. పొగమంచు కారణంగా నాకు జలుబు చేసింది. పైగా దట్టమైన పొగకారణంగా హెలికాప్టర్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం నేను దానికోసంమే ఎదురుచూస్తున్నా.మంచు పోయాక బయలు దేరతాను. పూర్తి వివరాలన్నీ అప్‌డేట్ చేస్తాను’ అని అన్నారు.
ఇదంతా చెప్తుంటే తాను న్యూస్ రిపోర్టర్‌లా ఉన్నానంటూ నవ్వుతూ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. క్షేమంగా ఇంటికి చేరుకోండి.. హ్యాపీ జర్నీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 90వ దశకంలో శోభన టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలందరి సరసన నటించారామె. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ప్రస్తుతం భరత నాట్యం ప్రదర్శనలతో పాటు క్లాసికల్ డ్యాన్స్‌లకు సంబంధించిన క్లాసులు చెప్తూ బిజీగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment