
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న విడుదల కానున్న కల్కి మూవీ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే తాజాగా 'థీమ్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో దీనిని తెరకెక్కించారు. సీనియర్ ప్రముఖ నటి శోభనతో పాటు మరికొందరు నృత్య ప్రదర్శన చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ త్వరలో విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment