Naga Ashwin
-
'థీమ్ ఆఫ్ కల్కి'లో శోభన ప్రదర్శన.. వీడియో రిలీజ్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న విడుదల కానున్న కల్కి మూవీ టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే తాజాగా 'థీమ్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో దీనిని తెరకెక్కించారు. సీనియర్ ప్రముఖ నటి శోభనతో పాటు మరికొందరు నృత్య ప్రదర్శన చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ త్వరలో విడుదల చేయనున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ మహానటి
-
మహానటి టీజర్ వచ్చేసింది..
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్రి జీవితంలోని ఏ అంశాలను టీజర్లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్లో కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కీర్తి సురేష్ లెజండరీ కథానాయకి, మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మూవీ ప్రోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతున్నాయి. -
మహానటి టీజర్ విడుదల..
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మహానటి’
కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా మహానటి. లెజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలుసంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం సెట్లో గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పనులు ముగించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ.. ‘మా టెక్నికల్ టీమ్ ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా ‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి మా బ్యానర్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు ఎప్పటికీ ఋణపడి ఉంటాం. మాకోక స్ట్రాంగ్ సపోర్ట్ గా మోహన్ బాబుగారు, రాజేంద్రప్రసాద్ గారు నిలబడ్డారు. వారితో కలిసి పనిచేసిన ప్రతి నిమిషం మాకు అపురూపమైనది. ఆఖరి రోజున ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ పూజలో భాగంగా సావిత్రిగారి పటం వద్ద ప్రతిమ వెలిగిస్తున్న తరుణంలో కనీరు పెట్టుకొంది. మే 9న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది’ అన్నారు. -
ఒకే నెలలో 3 సినిమాలకు టాటా
సాక్షి, సినిమా : సమంత పెళ్లి తరువాత కూడా తన జోరు కొనసాగిస్తోంది. మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమా షూటింగ్ ముగింసింది. అయితే సమంత ఈ నెలలో ‘రంగస్థలం’ సినిమా షూటింగ్‌తో పాటు తమిళ సినిమా ‘ఇరుంబు థిరై’ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. దీంతో సామ్ ఒకే నెలలో మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సామ్ తన ట్విటర్ ద్వారా దర్శకుడు నాగ్ అశ్విన్‌కి కృతజ్ఞతలు తెలిపింది. వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్లో చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని ట్వీట్ చేసింది. ఇందులో సమంత మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సమంత మహానటి సెట్లో కుర్చీలో కూర్చుని చిన్నపాటి కునుకు తీస్తున్న ఫొటోను ట్వీట్ చేసిందది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలనాటి అందాలతార, అభినయ రాణి సావిత్రి జీవితం ఆధారంగా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. తమిళ్లో ‘నడిగర్ తిలకం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ అశ్విన్ దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, భానుప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. ఈ సినిమా మే 9న ఈ విడుదల కానుంది. Such sweet words 🤗Thankyou for everything. So proud of what you’ve done for the film . One of its biggest strengths . More power to you ❤️ https://t.co/BMj2bzPC4Z — Samantha Akkineni (@Samanthaprabhu2) March 19, 2018 And it’s a wrap on #Mahanati 💃💃 Wrapped up 3 films this month 💪 Been an absolute honour to be part of such history @VyjayanthiFilms @nagashwin7 Thankyou for a wonderful experience!! #MahanatiOnMay9th — Samantha Akkineni (@Samanthaprabhu2) March 19, 2018 -
‘మహానటి’ వాయిదా..!
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ మహానటి. అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేష్ గా కనిపించనున్నాడు. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, సమంత లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఏఎన్నార్‌గా నటించేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ముందుగా మార్చి 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే ఇంకా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
‘మహానటి’ వాయిదా పడిందా..?
అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి తారలు నటిస్తున్న ఈ సినిమాకు ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇంకా షూటింగ్ పనులు పూర్తి కాకపోవటంతో పాటు మార్చి 30న భారీ అంచనాలున్న రంగస్థలం రిలీజ్ అవుతుండటంతో మహానటి విడుదలను వాయిదా వేశారు. ఏప్రిల్ నెలలో కూడా పెద్ద సినిమాల రిలీజ్ ఉండటంతో వేసవి చివర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్
‘ఎవరూ తాగి వాహనాలు నడపొద్దని’ ఏంజెల్ సినిమా హీరో, హీరోయిన్ నాగఅన్వేష్, హెబ్బాపటేల్ సూచించారు. గచ్చిబౌలిలోని ‘ది టిల్ట్’ బార్లో ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’పై శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. మందు తాగే చోటే, దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. బార్ డైరెక్టర్ విజయ్పట్వారీ పాల్గొన్నారు. -
వెండితెరపై మహానటి!
వెండితెర మహారాణిగా, అసామాన్య నటిగా ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న ఓ నట శిఖరం సావిత్రి. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించి, ‘మహానటి’ అనిపించుకున్నారు. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ అశ్విన్ ఈ జీవితకథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఆనాటి ఆనవాళ్లను మళ్లీ సెల్యులాయిడ్‌పై పునః సృష్టి చేయనున్నాం. సామాన్య స్త్రీ నుంచి ఓ సూపర్‌స్టార్‌గా సావిత్రి ఎదిగిన తీరు నేటి తరానికి మంచి పాఠంలా మిగిలిపోయింది. ఇన్నేళ్ళలో ఎంత మంది కథానాయికలు వచ్చినా సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. నటీమణుల్లో చాలా తక్కువ మంది ‘లెజెండ్’ హోదాన్ని దక్కించుకున్నారు. వాళ్లలో సావిత్రిగారు ఒకరు. ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న అనుభవాల కలబోతే ఈ చిత్రం’’ అని నాగ అశ్విన్ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం ఎంతో మందిని కలిసి, రీసెర్చ్ చేసి సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నారట. ఈ చిత్రాన్ని సీరియస్ ధోరణిలో ఆయన తీయాలనుకోవడంలేదు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ, దాన్ని టచ్ చేయకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్‌లా ఈ సినిమా ఉండేలా నాగ అశ్విన్ స్క్రిప్ట్‌ను వర్కవుట్ చేశారు. ఒక మహానటి జీవితానికి తెరరూపం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రెండో సినిమాతోనే అలాంటి ప్రయత్నం చేయడం అంటే నాగ అశ్విన్‌ని అభినందించాల్సిందే.