ఒకే నెలలో 3 సినిమాలకు టాటా | Samantha Completed Three Movies in a Span of One Month
Sakshi News home page

ఒకే నెలలో 3 సినిమాలకు టాటా

Published Tue, Mar 20 2018 8:58 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Samantha Complet Three Movies Shooting with in a Month - Sakshi

సాక్షి, సినిమా : సమంత పెళ్లి తరువాత కూడా తన జోరు కొనసాగిస్తోంది. మహాన‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ‘మ‌హాన‌టి’ సినిమా షూటింగ్‌ ముగింసింది. అయితే సమంత ఈ నెల‌లో ‘రంగ‌స్థలం’  సినిమా షూటింగ్‌తో పాటు త‌మిళ సినిమా ‘ఇరుంబు థిరై’  షూటింగ్ పూర్తి చేసుకున్నారు.  దీంతో సామ్‌ ఒకే నెలలో మూడు సినిమాల షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సామ్‌ తన ట్విటర్ ద్వారా ద‌ర్శకుడు నాగ్ అశ్విన్‌కి కృత‌జ్ఞత‌లు తెలిపింది. వైజయంతి ఫిలిమ్స్‌ బ్యాన‌ర్‌లో చేయ‌డం చాలా సంతోషాన్ని క‌లిగించింద‌ని ట్వీట్ చేసింది. ఇందులో స‌మంత మ‌ధుర‌వాణి అనే జ‌ర్నలిస్ట్ పాత్రలో కనిపించ‌నున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సమంత మహానటి సెట్‌లో కుర్చీలో కూర్చుని చిన్నపాటి కునుకు తీస్తున్న ఫొటోను ట్వీట్‌ చేసిందది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

అలనాటి అందాలతార, అభినయ రాణి సావిత్రి జీవితం ఆధారంగా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. తమిళ్‌లో ‘నడిగర్‌ తిలకం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తీ సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో, సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ అశ్విన్‌ దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, భానుప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎన్నార్‌ పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. ఈ సినిమా మే 9న‌ ఈ విడుద‌ల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement