'కల్కి'లో సీనియర్‌ నటి.. పద్దెనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ | Sobhana Re-Entry Into Telugu Cinema After 18 Years As Mariam In Kalki 2898 AD, Deets Inside | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: 'కల్కి'లో సీనియర్‌ నటి.. పద్దెనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ

Published Wed, Jun 19 2024 12:54 PM | Last Updated on Wed, Jun 19 2024 1:25 PM

Sobhana As Mariam In Kalki 2898 AD

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ నుంచి ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.

తాజాగా కల్కి అభిమానులకు మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ సినిమాలోని మరియమ్‌ పాత్రను ప్రేక్షకులకు చిత్ర యూనిట్‌ పరిచయం చేసింది. మరియ‌మ్ పాత్రలో సీనియర్‌ నటి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శోభన నటిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.  2006లో వచ్చిన ‘గేమ్‌’ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత కల్కి చిత్రం ద్వారా మళ్లీ వెండితెరపై శోభన కనిపించనున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. 

మరో 8 రోజుల్లో మరియమ్‌ను కలుస్తారని వైజయంతి మూవీస్ వారు ఒక పోస్ట్‌ రిలీజ్‌ చేశారు. అందరినీ మెప్పించేలా ఆమె లుక్‌ ఉంది. ప్రస్తుతం నెట్టింట శోభన పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ అతిథి పాత్రల్లో నటించారనే టాక్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఎవరెవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement