sobhana
-
'థీమ్ ఆఫ్ కల్కి'లో శోభన ప్రదర్శన.. వీడియో రిలీజ్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27న విడుదల కానున్న కల్కి మూవీ టికెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే తాజాగా 'థీమ్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో దీనిని తెరకెక్కించారు. సీనియర్ ప్రముఖ నటి శోభనతో పాటు మరికొందరు నృత్య ప్రదర్శన చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్ త్వరలో విడుదల చేయనున్నారు. -
'కల్కి'లో సీనియర్ నటి.. పద్దెనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.తాజాగా కల్కి అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని మరియమ్ పాత్రను ప్రేక్షకులకు చిత్ర యూనిట్ పరిచయం చేసింది. మరియమ్ పాత్రలో సీనియర్ నటి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శోభన నటిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 2006లో వచ్చిన ‘గేమ్’ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత కల్కి చిత్రం ద్వారా మళ్లీ వెండితెరపై శోభన కనిపించనున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. మరో 8 రోజుల్లో మరియమ్‌ను కలుస్తారని వైజయంతి మూవీస్ వారు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అందరినీ మెప్పించేలా ఆమె లుక్ ఉంది. ప్రస్తుతం నెట్టింట శోభన పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో నటించారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఎవరెవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.Her ancestors waited too, just like her…8 days to go for #Kalki2898AD.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Shobana @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/xEnJZRuPQ3— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 19, 2024 -
దట్టమైన పొగమంచులో చిక్కుకున్న నటి శోభన.. వీడియో వైరల్
సినియర్ నటి, ప్రముక భరతనాట్య కళాకారిణి శోభన పొగమంచులో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు. కేదార్నాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్న ఆమె అక్కడి వాతావరణం గురించి చెబుతూ ఓ వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంది. పొగమంచు కారణంగా నాకు జలుబు చేసింది. పైగా దట్టమైన పొగకారణంగా హెలికాప్టర్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం నేను దానికోసంమే ఎదురుచూస్తున్నా.మంచు పోయాక బయలు దేరతాను. పూర్తి వివరాలన్నీ అప్డేట్ చేస్తాను’ అని అన్నారు. ఇదంతా చెప్తుంటే తాను న్యూస్ రిపోర్టర్లా ఉన్నానంటూ నవ్వుతూ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. క్షేమంగా ఇంటికి చేరుకోండి.. హ్యాపీ జర్నీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 90వ దశకంలో శోభన టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలందరి సరసన నటించారామె. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ప్రస్తుతం భరత నాట్యం ప్రదర్శనలతో పాటు క్లాసికల్ డ్యాన్స్‌లకు సంబంధించిన క్లాసులు చెప్తూ బిజీగా ఉంటున్నారు. View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) -
నమస్తే.. మేడమ్!
ప్రస్తుతం శోభనా రనాడే పుణె శివాజీనగర్‌లో ఉన్న హెర్మన్ జమైన్ సోషల్ సెంటర్ తరఫున వీధి బాలలకు చదువు, పోషకాహారం, ఆరోగ్యం, కౌన్సెలింగ్, పునరావాసం కల్పిస్తున్నారు. ఎందరో మహిళలకు ఆమె జీవితం ఒక చక్కని పుస్తకం. ప్రతి పేజీలోనూ ఆమె సంతకం ఉంటుంది. ఆ సంతకం వెనుక గాంధీజీ ఆశయాల స్ఫూర్తి ఉంటుంది. అణగారిన వర్గాల మహిళల ఉన్నతి కోసం పాటుపడిన జీవితం ఉంటుంది. ఆమే.. శోభనా రనాడే. అత్యున్నత పద్మభూషణ్ అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ను దక్కించుకున్నారు. ఇప్పుడు ‘జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్’ కు నామినేట్ అయ్యారు. ఈ 93 ఏళ్ల వయసులోనూ సమాజసేవలో తరించాలని తపించిపోతున్నారు. ప్రధానంగా గిరిజన బాలికలు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. గాంధీజీని కలిశారు శోభనా రనాడే సుమారు 50 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్నారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఆవిడ మనసు ఆర్ద్రతతో నిండిపోయేది. ఎంతో మంది మహిళలు, బాలలు నిరక్షరాస్యులుగా ఉండటం ఆమెను కలిచివేసేది. వీధిబాలలు తిండి కోసం కుక్కలతో పోట్లాడటం, మహిళలు అత్యాచారాలకు గురికావడం చూసి ఆమె హృదయం ద్రవించిపోయేది. వాళ్లకేదైనా చేయాలని సంకల్పించుకుంది. çపుణె అగాఖాన్ గాంధీ మెమోరియల్ సొసైటీలో, నేషనల్ ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమన్‌లో పని చేసిన అనుభవం ఆమె సంకల్పానికి బలం చేకూర్చింది. మొదట 1942లో తన 18వ ఏట, శోభన పుణెలోని అగాఖాన్ ప్యాలెస్‌లో మహాత్మాగాంధీని స్వయంగా కలిశారు. వినోభాతో నడిచారు 1955లో శోభన లక్ష్యసాధనకు ఒక మార్గం దొరికింది. అస్సాంలోని ఉత్తర లఖింపూర్‌కి వినోబాభావేతో కలసి పాదయాత్ర చేయడానికి వెళ్లారు. అప్పుడు ఆమె వయసు 31. ఆ పరిసరాలలో నివసిస్తున్న అనాథ బాలలను చూసి, వారి కోసం అక్కడ ఏదైనా ఒకటి ప్రారంభించాలనుకున్నారు. ముప్పై మంది పిల్లలతో శిశునికేతన్ ప్రారంభించారు. వారికి చదువు నేర్పడంతో పాటు, సకల సౌకర్యాలు కల్పించారు. ఆమెలోని సేవా భావం చూసిన కొందరు సంపన్నులు, శిశు నికేతన్ నిర్వహణ కోసం చందాలు ఇచ్చి, ఒక ట్రస్ట్ ఏర్పాటుచేశారు. నేటికీ ఆ సంస్థ ఎంతో చక్కగా నడుస్తోంది. అక్కడ ఉండగానే, డిగ్బోయ్ జిల్లాలో మొట్టమొదటి బాలల సంక్షేమ పాఠశాల ప్రారంభించారు శోభన. గిరులలో తిరిగారు అస్సాంలో కొన్నేళ్లు ఉండి నాగాలాండ్ వెళ్లారు శోభన. అక్కడ కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ‘ఆదిమజాతి సేవా సంఘ్’ నెలకొల్పి నాగా గిరిజన మహిళలకు అల్లికలలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కోహిమాలో ఖాదీ భాండార్ ప్రారంభించి, గిరిజన మహిళలు రూపొందించిన వస్తువులను విక్రయించారు. అక్కడ ఉంటూనే, అరుణాచల్ ప్రదేశ్‌లో మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలలోని వెనుకబాటుతనాన్ని కళ్లారా చూసిన శోభన వారి అభ్యున్నతికి తన వంతుగా కృషి చేశారు. తర్వాత పుణె తిరిగి వచ్చారు. నేర్పించారు.. నిలబెట్టారు శోభన పుణెలోని పురందర్ తాలూకా సస్వాద్లో ఉన్న కస్తూర్బా గాంధీ నేషనల్ ట్రస్ట్‌కి ట్రస్టీగా కూడా వ్యవహరించారు. ఈ ట్రస్ట్ పదకొండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో ఆరు ఎకరాలు వ్యవసాయానికి కేటాయించారు శోభన. మిగిలిన ఐదు ఎకరాలలో ఆశ్రమానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు నిర్వహించేవారు. అందులోనే, బాలగృహలో 40 మంది మహిళలకు ఆవాసం ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించి, ఉపాధి విద్యలు నేర్పించారు. ఆశ్రమంలోనే ఓ మూల కూరలు పండించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు, వృత్తి విద్యలలోనూ, గ్రామీణ పరిశ్రమలలోను అక్కడి మహిళలకు శిక్షణ ఇప్పించారు. టైలరింగ్, పిండి రుబ్బటం, పిండి వంటలు తయారుచేయటం, నగలు తయారుచేయటం నేర్పించారు. వీటి ద్వారా ఈ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. వారి కాళ్ల మీద వారు నిలబడ్డారు. – రోహిణి (జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ అందించిన వివరాల ఆధారంగా) -
ఎల్వోయూలపై నిషేధంతో చిన్న సంస్థలకు దెబ్బ
న్యూఢిల్లీ: లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)ని రిజర్వ్ బ్యాంక్ నిషేధించడం.. వ్యాపారాలపై తక్షణ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు.. మరింతగా నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 13,000 కోట్ల కుంభకోణం దరిమిలా దిగుమతిదారులు రుణ సదుపాయం పొందేందుకు ఉపయోగపడే ఎల్వోయూలను ఇకపై జారీ చేయొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో పరిశ్రమ వర్గాల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం దిగుమతి సంస్థల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుందని, చాన్నాళ్లుగా ఎల్వోయూల ఆధారంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లు తాజా పరిణామంతో తప్పనిసరిగా లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీ వంటి సాధనాల వైపు మళ్లాల్సి వస్తుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ శోభన కామినేని పేర్కొన్నారు. మరోవైపు, కుంభకోణాల్లాంటి వాటిని అరికట్టేందుకు ఈ సాధనాలను నిషేధించడం పరిష్కార మార్గం కాదని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ అనిల్ ఖేతాన్ వ్యాఖ్యానించారు. లావాదేవీలకు అనుగుణంగా మూలధనాన్ని నిర్వహించుకునే చిన్న తరహా సంస్థలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. తాజా పరిణామంతో అవి మరింత అధిక నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని లేకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఖేతాన్ వివరించారు. విధానకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలి: సన్యాల్ న్యూఢిల్లీ: నీరవ్ మోదీ స్కామ్ నేపథ్యంలో బ్యాంకులు ఎల్వోయూలు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ తరహా చర్యల విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విధాన కర్తలకు సూచించారు. ఒక మార్గాన్ని మూసివేసే చర్య మిగిలిన వ్యవస్థకు పాకకుండా చూడాలని, ఎందుకంటే సిలో వ్యవస్థ (ఇతర వ్యవస్థలతో అనుసంధానం కాని)తో వ్యవహరించడం లేదని గుర్తు చేశారు. -
స్వరార్చన
సాక్షి, తిరుమల : తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరి భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన శోభన విఘ్నేష్ బృందం ఈ కచేరి నిర్వహించింది. పలువురు వాగ్గేయకారులు రచించిన భక్తి సంకీర్తనలను సుమధురంగా అలపించారు. గంటన్నరపాటు జరిగిన ఈ కచేరిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులకు నాదనీరాజనం సిబ్బంది లడ్డూప్రసాదాలు అందజేశారు.