న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లు గురించి కొన్ని కీలక వ్యాక్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయన రూపాయి విలువ పతనమవ్వకుండా ఆర్థికంగా బాగుండాలంటే కరెన్సీపై మహాత్మాగాంధీ ఫోటోతో పాటు వినాయకుడు, లక్ష్మీదేవి ఫోటోలు కూడా ఉండాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండానే గట్టి సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఆప్ నాయకుడు ఈ వ్యాఖ్యలను నిజాయితీగా చెప్పి ఉంటే అభినందించే వాడినని అన్నారు.
అయినా ఎన్నికల సమీపిస్తున్నప్పుడే మన దేవతలు గుర్తుకు వస్తారనేది అతని గతమే చెబుతోందంటూ కౌంటరిచ్చారు. బీజీపీ హిందూత్వ ఎజెండాను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కదమ్. కేజ్రీవాల్ తన ప్రభుత్వ లోపాలను, తన పార్టీ హిందూత్వ వ్యతిరేక ఆలోచనల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు బీజేపీ నేత రామ్ కదమ్ ట్విట్టర్‌లో....కరెన్సీ నోట్లపై ప్రధాని నరేంద్రమోదీ, హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ఫోటోలను ముద్రించొచ్చు కదా అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా దేశం గర్వించేలా చేస్తున్న ప్రధాని మోదీ త్యాగం, అంకితభావం, కృషిని ఎలా మరువగలం అని ప్రశ్నించారు. ఈక్రమంలో ఆయన రూ.500ల నోటుపై మరాఠా చక్రవర్తి శివాజీ గణేష్, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్, ప్రధాని మోదీ, వీడీ సావర్కర్ వంటి ప్రముఖుల ఫోటోలు ముద్రించి ఉన్న కరెన్సీలను షేర్‌చేస్తూ... అఖండ్ భారత్, నయా భారత, మహాన్ భారత్, జై శ్రీరామ్, జై మాతాజీ అని ట్వీట్ చేశారు.
अखंड भारत.. नया भारत.. महान भारत..
— Ram Kadam (@ramkadam) October 27, 2022
जय श्रीराम .. जय मातादी ! pic.twitter.com/OPrNRu2psl
(చదవండి: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలి.. అలా చేస్తే లాభమేంటో చెప్పిన కేజ్రీవాల్)
Comments
Please login to add a commentAdd a comment