Ram Kadam
-
కరెన్సీ నోటుపై మోదీ ఫోటో ఎందుకు ఉండకూడదు? బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరెన్సీ నోట్లు గురించి కొన్ని కీలక వ్యాక్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయన రూపాయి విలువ పతనమవ్వకుండా ఆర్థికంగా బాగుండాలంటే కరెన్సీపై మహాత్మాగాంధీ ఫోటోతో పాటు వినాయకుడు, లక్ష్మీదేవి ఫోటోలు కూడా ఉండాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కేజ్రీవాల్ పేరు ప్రస్తావించకుండానే గట్టి సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. ఆప్ నాయకుడు ఈ వ్యాఖ్యలను నిజాయితీగా చెప్పి ఉంటే అభినందించే వాడినని అన్నారు. అయినా ఎన్నికల సమీపిస్తున్నప్పుడే మన దేవతలు గుర్తుకు వస్తారనేది అతని గతమే చెబుతోందంటూ కౌంటరిచ్చారు. బీజీపీ హిందూత్వ ఎజెండాను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కదమ్. కేజ్రీవాల్ తన ప్రభుత్వ లోపాలను, తన పార్టీ హిందూత్వ వ్యతిరేక ఆలోచనల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు బీజేపీ నేత రామ్ కదమ్ ట్విట్టర్లో....కరెన్సీ నోట్లపై ప్రధాని నరేంద్రమోదీ, హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ఫోటోలను ముద్రించొచ్చు కదా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశం గర్వించేలా చేస్తున్న ప్రధాని మోదీ త్యాగం, అంకితభావం, కృషిని ఎలా మరువగలం అని ప్రశ్నించారు. ఈక్రమంలో ఆయన రూ.500ల నోటుపై మరాఠా చక్రవర్తి శివాజీ గణేష్, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్, ప్రధాని మోదీ, వీడీ సావర్కర్ వంటి ప్రముఖుల ఫోటోలు ముద్రించి ఉన్న కరెన్సీలను షేర్చేస్తూ... అఖండ్ భారత్, నయా భారత, మహాన్ భారత్, జై శ్రీరామ్, జై మాతాజీ అని ట్వీట్ చేశారు. अखंड भारत.. नया भारत.. महान भारत.. जय श्रीराम .. जय मातादी ! pic.twitter.com/OPrNRu2psl — Ram Kadam (@ramkadam) October 27, 2022 (చదవండి: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలి.. అలా చేస్తే లాభమేంటో చెప్పిన కేజ్రీవాల్) -
ఆదిపురుష్‌కు మరోషాక్, ఈ సినిమా రిలీజ్ కానివ్వం: బీజేపీ ఎమ్మెల్యే
రోజురోజుకు ఆదిపురుష్ వివాదం ముదురుతోంది. ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్ వక్రికరించారంటూ హిందు సంఘాలు, బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రెండు వారాలు వేశ్య గృహంలో ఉన్నా: మృణాల్ షాకింగ్ కామెంట్స్ తాజాగా మరో బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదిపురుష్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వమంటూ ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వం. తమ చౌక ప్రచారం కోసం మరోసారి మా దేవుళ్లు, దేవతలను ఈ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’ అని ఆయన అన్నారు. ‘ఎప్పటిలాగే క్షమాపణలు చెప్పడం, సదరు సీన్లను కత్తిరించడం చేస్తే సరిపోదని, మరోసారి ఇలాంటి ఆలోచన చేయకుండా వారికి గుణపాఠం చెప్పాలన్నారు. చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇటువంటి తప్పులు పునరావుతం కాకుండా సినిమాలపై పూర్తిగా నిషేధం విధించాలని అని ఎమ్మెల్యే రామ్ కదమ్ డిమాండ్ చేశారు. కాగా మైథలాజికల్ చిత్రంగా రామాయణం ఇతీహాసం నేపథ్యంలో ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలోని రావణుడు, హనుమంతుడి పాత్రలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. రామాయణలో చూపించి విధంగా వారిని చూపించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు గ్రాఫీక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈచిత్రంలో వీఎఫ్ఎక్స్ విజువల్స్ అసలు బాగాలేవని, ఓ యానిమేటెడ్ చిత్రం చూస్తున్నట్టుగా ఉందంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
-
సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తాలిబన్ల పేరు భారతదేశంలో మార్మోగుతోంది. తాలిబన్లకు ముడిపెట్టి రాజకీయాలు జరుగుతున్నాయి. నిన్ననే పెట్రోల్ ధరల పెరుగుదలకు తాలిబన్లే కారణమని ఓ బీజేపీ ఎమ్మెల్యే తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే బాలీవుడ్ ప్రముఖ రచయిత స్కీన్ రైటర్ జావేద్ అక్తర్ కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. దేశంలో కూడా తాలిబన్ల మాదిరి ఆర్ఎస్ఎస్ తయారైందని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జావేద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే జావేద్ అక్తర్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన సినిమాలు దేశంలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ శనివారం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని ఘట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదాం స్పందించారు. ట్విటర్లో ఓ వీడియో విడుదల చేశారు. చదవండి: తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం ‘జావేద్ అక్తర్ వ్యాఖ్యలు సిగ్గు చేటు. అంతేకాకుండా బాధాకరం. సంఘ్, విశ్వ హిందూ పరిషత్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వసిస్తున్న కోట్లాదిమందికి ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయి. సంఘ్‌కు చెందిన వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పేంత వరకు మేం అతడి సినిమాలను భరత గడ్డపై విడుదల చేయనీయం’ అని రామ్ కదాం తెలిపారు. ట్విటర్లో ఈ వీడియోను విడుదల చేశారు. జావేద్ అక్తర్ మాజీ ఎంపీ. ప్రముఖ నటి షబానా అజ్మీ భర్త. ఆయన పిల్లలు ఫర్మాన్ అక్తర్ ప్రముఖ నటుడు కాగా, కుమార్తె ప్రముఖ నిర్మాత జోయ అక్తర్. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. -
టీమిండియా కాషాయ జెర్సీ వెనుక బీజేపీ?
న్యూఢిల్లీ/ముంబై: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ (కాషాయ) రంగు జెర్సీలను ధరించనుంది. అయితే టీమిండియా ఆరెంజ్ జెర్సీ ధరించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. ఆదివారం టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలను ధరించనుంది. కనీసం రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని ఐసీసీ అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే టీమిండియా రెండు జెర్సీలతో ఇంగ్లండ్ వెళ్లింది. దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘క్రికెటర్లు ధరించే జెర్సీలకు ఆరెంజ్ రంగు పులుముతున్నారు. జాతీయ పతాకంలో మూడు వర్ణాలను నిర్ణయించిన వ్యక్తి ముస్లిం అని మోదీ గుర్తుపెట్టుకోవాలి. జెర్సీలకు మరో రంగు ఎంచుకోవాల్సి వస్తే త్రివర్ణాన్ని ఎంచుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రతిదాన్ని కాషాయికరణ చేయాలకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పద’ని అబు అజ్మీ అన్నారు. ఈ వాదనను బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ వ్యతిరేకించారు. జెర్సీ రంగుపై రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాషాయ రంగును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఆరెంజ్ జెర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ అన్నారు. ఆటలకు, రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. -
సొనాలికి శ్రద్ధాంజలి.. బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే
ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ హీరోయిన్ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార.. తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్ కదమ్ ట్వీట్ చేశారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తెలుసుకున్న రామ్ కదమ్.. ‘గత రెండు రోజులుగా సొనాలి బింద్రే గురించి నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకొని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ మరో ట్వీట్‌తో తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రామ్ కదమ్ నెటిజన్ల చేతిలో బుక్కయ్యారు. ‘ఆ నకిలీ వార్తలు ప్రచారం చేసింది మీరే కదా.. మళ్లీ ఇదేంటి’ అంటూ రామ్ కదమ్ పాత ట్వీట్ స్క్రీన్షాట్లతో ఆయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న సొనాలీ బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. About Sonali Bendre ji It was rumour . Since last two days .. I pray to God for her good health & speedy recovery — Ram Kadam (@ramkadam) September 7, 2018 U spread the rumour @ramkadam pic.twitter.com/DTSFb8A3Ra — NAVEEN DHAWAN (@NAVEENDHWAN) September 7, 2018 -
ఆ ఎమ్మెల్యే నాలుక కోస్తే రూ.5 లక్షలిస్తా!
ముంబై : ‘మీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పండి. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకువచ్చే పూచీ నాది’. అని అమ్మాయిల పట్ల అసహ్యంగా మాట్లాడిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ నాలుక కోస్తే రూ. 5 లక్షలిస్తానని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుబోధ్ సావ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల ఎమ్యెల్యే తీరును తప్పుబట్టిన ఆయన ఇలాంటి చెత్త మాటలు మాట్లాడిన ఆ నాలుకను కోసేయాలని మండిపడ్డారు. ముంబైలోని ఘట్కోవర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రామ్ కదమ్ శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా గత సోమవారం నిర్వహించిన సంప్రదాయ ‘దహీ హండీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యువకులంతా.. మీకు ఎలాంటి అవసరమున్నా సరే నన్ను కలవండి. 100 శాతం పక్కాగా సాయం చేస్తా. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులను వెంటబెట్టుకురండి. వారు అంగీకరిస్తే మీరు ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేసి, మరి మీతో పెళ్లి చేయిస్తా’ అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తాయి. అతని ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధై అమ్మాయిలను కిడ్నాప్ చేస్తానని బహిరంగంగా ప్రకటించడం ఏంటని మండిపడుతున్నాయి. -
మీ కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసుకొస్తా
ముంబై: ‘మీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పండి. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకువచ్చే పూచీ నాది’..ఈ మాటలు అన్నది ఏ రౌడీనో కాదు. స్వయంగా మహారాష్ట్రలోని అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే. ముంబైలోని ఘాట్కోపర్ నియోజకవర్గంలో శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా సోమవారం నిర్వహించిన సంప్రదాయ ‘దహీహండీ’ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామ్ కదమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన యువకులతో మాట్లాడారు. ‘మీకు ఎలాంటి అవసరమున్నా సరే నన్ను కలవండి. 100 శాతం పక్కాగా సాయం చేస్తా. నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులను వెంటబెట్టుకురండి. మీరు మనసు పడిన అమ్మాయిని కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకునేందుకు మీకు అప్పగిస్తా’ అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా తన ఫోన్ నంబర్ కూడా వారికి చెప్పారు. -
అమ్మాయిని కిడ్నాప్ చేస్తా : బీజేపీ ఎమ్మెల్యే
ముంబై : ప్రేమ రెండు మనసులకు సంబంధించినది. ఒక అబ్బాయి తాను ఇష్టపడే అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేశాక, ఆ ప్రేమను ఆమె తిరస్కరించవచ్చు, అంగీకరించవచ్చు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి అబ్బాయికి ఉంటుంది. కానీ గటోకోపర్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఒక అమ్మాయిని ప్రేమించి తన ప్రేమను వ్యక్తం చేశాకా... అబ్బాయిని తిరస్కరిస్తే... అలాంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసైనా సరే ఆ అబ్బాయికిచ్చే వివాహం జరిపిస్తానంటూ రామ్ కదం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా.. అబ్బాయిల కోసం ఆమెను కిడ్నాప్ చేస్తా అనడం వివాదాస్పదంగా మారింది. కదం ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా చేశారు. అంతే కాకుండా వారికి సాయం చేసేందుకు, ఏ సమయంలోనైనా సరే తనకు ఒక్క ఫోన్ కాల్ కొట్టడంటూ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తామని తెలిపారు. "మీకు సాయం కావాల్సి వస్తే, నాకు ఫోన్ చేయండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను కానీ అమ్మాయి నా ప్రేమను తిరస్కరిస్తోంది అని చెప్పి సహాయం అడగండి. నేను తప్పకుండా సహాయం చేస్తాను. అదే సమయంలో మీ తల్లిదండ్రులను కూడా పిలిపించాలి. అమ్మాయి వారికి నచ్చితే నేనే కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తా. ఇక నా ఫోన్ నెంబర్ తీసుకోండి" అంటూ దహీ హండీ(ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కదం అన్నారు. రామ్ కదం చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఎన్సీపీ జితేంద్ర అవధ్ ట్విటర్లో షేర్ చేశారు. ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. కదం చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభ్యులు ఇలా ఆలోచిస్తే, మహారాష్ట్రలో మహిళల రక్షణ ఎక్కడుంటుందని జితేంద్ర ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడం, నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రామ్ కదం ఆత్మరక్షణలో పడిపోయారు. ముందుగా పిల్లలు తల్లిదండ్రులకు తెలపాలని మాత్రమే తాను చెప్పినట్లు రామ్ కదం అంటున్నారు. రాజకీయ కుట్రతో కొందరు తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామ్ కదం ఏటా గట్కోపర్‌లో దహీ హండీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవుతుంటారు. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. बेताल वक्तव्य करणारा भाजपा नेत्यांमध्ये आणखी ऐकाची भर.. रक्षाबंधन , दहिकाला उत्सव या पवित्र सणा दिवशी आमदाराने तोडले आपल्या अकलेचे तारे ! कशा राहतील यांचा राज्यात महिला सुरक्षित? pic.twitter.com/Z5JAx5ewrN — Dr.Jitendra Awhad (@Awhadspeaks) September 4, 2018