
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కు లేఖ రాశారు. రాజస్తాన్ పోలీసులు సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ ఘటనపై విచారణ నిమిత్తం ఏలాంటి సమాచారం లేకుండా తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేని, ఇద్దరు కార్యకర్తలను రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా చట్టవ్యతిరేకమని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాకుండా పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే తమ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఈ ఘటనపై శాంతియుతతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళా కార్యకర్తలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సీఎంకు తెలియజేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని గెహ్లోట్‌కు విజ‍్క్షప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment