సీతారాం ఏచూరితో మంద కృష్ణ భేటీ | Mandha Krishna meeting with Sitaram Yechury | Sakshi
Sakshi News home page

సీతారాం ఏచూరితో మంద కృష్ణ భేటీ

Published Thu, Dec 8 2016 2:22 AM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM

Mandha Krishna meeting with Sitaram Yechury

వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి

 సాక్షి, న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు సముఖత చూపుతున్న తరుణంతో.. తదుపరి తమకు మద్దతు ఇవ్వాలని ఏచూరిని కోరినట్టు మంద కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ వినోద్‌కుమార్‌తో మంద కృష్ణ సమావేశమై వర్గీకణకు మద్దతివ్వాలని కోరారు.

 ఆరెకటిక కులాన్ని ఎస్సీలో చేర్చండి: ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరెకటిక పోరాట సమితి బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాల్లో చేర్చారని, అరుుతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీ-డీలో ఉన్నారని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.సుధాకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement