
ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదనీ, ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలన్నారు.