ఏచూరిపై దాడికి యత్నం | Two people raising slogans try to manhandle Sitaram Yechury | Sakshi
Sakshi News home page

ఏచూరిపై దాడికి యత్నం

Published Wed, Jun 7 2017 4:56 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

ఏచూరిపై దాడికి యత్నం - Sakshi

ఏచూరిపై దాడికి యత్నం

- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిపై హిందూ అతివాదుల దుశ్చర్య
న్యూఢిల్లీ:
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూ అతివాదులు దాడికి యత్నించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది.

మీడియా సమావేశంలో పాల్గొనేందుకు నడుకుంటూ వస్తోన్న ఏచూరిపై హిందూసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు.. ఆ ఇద్దరినీ దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్నందునే హిందూ అతివాదులు ఈ తరహా దాడులకు తెగబడ్డారని సీపీఎం నేతలు అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement