Hindusena
-
హిందూసేన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: కర్ణాటకలో మతం పేరుతో ఓట్లడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని, ఆ పార్టీ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రీయ హిందూసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. ముస్లింల కోసం మదర్సా బోర్డు, క్రైస్తవులకు క్రిస్టియన్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ ఓట్లడుగుతోందని లాయర్ వాదించారు.కాగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవని బెంచ్ పేర్కొంది. -
ఏచూరిపై దాడికి యత్నం
- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిపై హిందూ అతివాదుల దుశ్చర్య న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై హిందూ అతివాదులు దాడికి యత్నించారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఈ సంఘటన జరిగింది. మీడియా సమావేశంలో పాల్గొనేందుకు నడుకుంటూ వస్తోన్న ఏచూరిపై హిందూసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సీపీఎం కార్యకర్తలు.. ఆ ఇద్దరినీ దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతున్నందునే హిందూ అతివాదులు ఈ తరహా దాడులకు తెగబడ్డారని సీపీఎం నేతలు అన్నారు. -
‘ట్రంప్ గెలవాలి!’
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ అవకాశం దక్కాలని చాలామంది అమెరికా వారే కోరుకోవడం లేదు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించాలని భారతదేశానికి చెందిన హిందూసేన ఈ నెల 11న ఢిల్లీలో ఒక యజ్ఞమే చేసింది. ఇస్లామిక్ మత చాందస ఉగ్రవాదుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించ గలిగినవాడు ఒక్క ట్రంప్ మాత్రమేనని హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా విలేకరులకి చెప్పారు. ట్రంప్ ఈ ఎన్నికలలో గెలవవలసిందేనని కోరుతూ, దేవతల ప్రీత్యర్థం నవధాన్యాలు, నెయ్యి హోమగుండంలో వేశారు. హిందూ దేవతల బొమ్మలతో పాటు తిలక ధారణం చేసిన ట్రంప్ ఫొటోలను కూడా యజ్ఞం దగ్గర పెట్టారు. ‘ఇస్లామిక్ మత ఛాందస ఉగ్రవాదం నుంచి ప్రపంచ మానవాళిని రక్షించగల ఆశా జ్యోతి: ట్రంప్‌కు హిందూసేన మద్దతు’ అని ఒక బ్యానర్ కూడా రాయించి పెట్టారు. ట్రంప్ గెలిస్తే భారత్‌కు చాలా మేలు జరుగుతుందని కూడా హిందూసేన భావిస్తున్నదట. భారత్ కూడా ఇస్లామిక్ చాందసవాదం బెడదను ఎదుర్కొం టున్నదే కాబట్టి, ట్రంప్ గెలిస్తేనే ఆ బెడద వదులు తుందని కూడా గుప్తా చెబుతున్నారు. చాందస వాదాన్ని దీటుగా ఎదుర్కొనడానికి ట్రంప్ వంటి నాయకుడే ఎన్నిక కావడం అవసరమని కూడా తాము భావిస్తున్నామని గుప్తా ప్రకటించారు. నన్ను ఎవరు విమర్శించినా నేను పట్టించుకోను. ట్రంప్ ఇస్లామిక్ ఛాందసవాదానికి సమాధానం చెప్పగల ధైర్యశాలి, అందుకే మా మద్దతు అంటు న్నాడాయన.