‘ట్రంప్ గెలవాలి!’
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆ అవకాశం దక్కాలని చాలామంది అమెరికా వారే కోరుకోవడం లేదు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అయితే ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించాలని భారతదేశానికి చెందిన హిందూసేన ఈ నెల 11న ఢిల్లీలో ఒక యజ్ఞమే చేసింది. ఇస్లామిక్ మత చాందస ఉగ్రవాదుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించ గలిగినవాడు ఒక్క ట్రంప్ మాత్రమేనని హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా విలేకరులకి చెప్పారు.
ట్రంప్ ఈ ఎన్నికలలో గెలవవలసిందేనని కోరుతూ, దేవతల ప్రీత్యర్థం నవధాన్యాలు, నెయ్యి హోమగుండంలో వేశారు. హిందూ దేవతల బొమ్మలతో పాటు తిలక ధారణం చేసిన ట్రంప్ ఫొటోలను కూడా యజ్ఞం దగ్గర పెట్టారు. ‘ఇస్లామిక్ మత ఛాందస ఉగ్రవాదం నుంచి ప్రపంచ మానవాళిని రక్షించగల ఆశా జ్యోతి: ట్రంప్కు హిందూసేన మద్దతు’ అని ఒక బ్యానర్ కూడా రాయించి పెట్టారు.
ట్రంప్ గెలిస్తే భారత్కు చాలా మేలు జరుగుతుందని కూడా హిందూసేన భావిస్తున్నదట.
భారత్ కూడా ఇస్లామిక్ చాందసవాదం బెడదను ఎదుర్కొం టున్నదే కాబట్టి, ట్రంప్ గెలిస్తేనే ఆ బెడద వదులు తుందని కూడా గుప్తా చెబుతున్నారు. చాందస వాదాన్ని దీటుగా ఎదుర్కొనడానికి ట్రంప్ వంటి నాయకుడే ఎన్నిక కావడం అవసరమని కూడా తాము భావిస్తున్నామని గుప్తా ప్రకటించారు. నన్ను ఎవరు విమర్శించినా నేను పట్టించుకోను. ట్రంప్ ఇస్లామిక్ ఛాందసవాదానికి సమాధానం చెప్పగల ధైర్యశాలి, అందుకే మా మద్దతు అంటు న్నాడాయన.