సీతారాం ఏచూరి
సాక్షి, నల్గొండ: కేంద్రం బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు నిరాశే మిగిలిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మంగళవారం పార్లమెంట్‌లో ఆందోళన చేయడంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పందించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అయిదేళ్లు ప్యాకేజీ ఇస్తామంటే.. పక్కనే ఉన్న వెంకయ్యనాయుడు పదేళ్లు అయితే బాగుంటుందని సూచించారని గుర్తు చేశారు.
పదేళ్లపాటు ప్యాకేజీ ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలులో విఫలమవుతున్న ఎన్డీఏలో ఉన్న టీడీపీ ప్రజలకు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టి టీడీపీ సాధించింది శూన్యమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment