రాజస్థాన్: రాజస్థాన్‌లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బుధవారం కాంగ్రెస్ ఆరోపించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ తరహాలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ మహేష్ జోషి విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై విచారణ జరపాలని ఏసీబీకి మహేష్ జోషి లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపారు.
జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అనైతికంగా గెలిచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని జోషి మండిపడ్డారు. రాజస్థాన్‌లో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా.. ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం రెండు కాంగ్రెస్, ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. కానీ, బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు
చదవండి: పాక్‌కు సమాచారం: ఇద్దరు ఉద్యోగుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment