హైదరాబాద్ : రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడని టిడిపి ఏజెంట్... రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముందు టీఆర్ఎస్ అభ్యర్థి కేశవరావుకు ఓటు వేశారు. కాగా ఎవరికి ఓటు వేస్తున్నారో బ్యాలెట్ చూపాలంటూ టీడీపీ ఏజెంట్ జనార్థన్ ...ఈ సందర్భంగా కమలాకర్ను కోరారు.
అయితే తాను టీఆర్ఎస్కే ఓటు వేస్తున్నానంటూ ఆయన బ్యాలెట్ పేపర్ను చూపించారు. దాంతో టీడీపీ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమలాకర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని...రికార్డు చేయాలని రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కోరారు. అయితే తమకు ఓటింగ్ రికార్డు చేసే అధికారం లేదని రిటర్నింగ్ అధికారి తెలిపారు. తెరాసలో చేరిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, హరీశ్వర్ రెడ్డి కూడా కేకేకు ఓట్లు వేశారు. అంతే కాకుండా వారు తాము వేసిన ఓటును పోలింగ్ ఏజెంట్కే కాకుండా అందరికి చూపించారు.
కేకేకు ఓటేసిన గంగుల, టీడీపీ అభ్యంతరం
Published Fri, Feb 7 2014 10:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement