ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో కొంతమంది బ్యాలెట్ పత్రాలను అందరికీ చూపించి నిబంధనలను ఉల్లంఘించారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి గంగుల కమలాకర్, హన్మంతు షిండే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిలు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా వారి ఓట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. వీరు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా ఆ ఓట్లను లెక్కించకూడదని టీడీపీ ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఎన్నికల కమీషన్ పై తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ పద్దతితో పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తున్నారో....పార్టీ ఏజెంట్లకు చూపించి ఓటు వేయాలి. కేవీపీ రామచంద్రరావు ఏజెంట్‌గా శ్రీపాద శ్రీనివాసరావు, టి.సుబ్బరామిరెడ్డికి ఏజెంట్‌గా రెహమాన్, ఎంఏ ఖాన్‌కు ఏజెంట్‌గా అన్వర్ వ్యవహరించారు.