![Rajya Sabha Elections Postponed Over Coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/24/cec.jpg.webp?itok=3woWCH3H)
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. వైరస్‌పై తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం.. కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. కాగా పది రాష్ట్రాల్లో ఇప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. మిగిలిన 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment