'ఢిల్లీలో నాకు చాలామందితో సత్సంబంధాలున్నాయి' | TRS Rajya Sabha Candidates DS And Captain Lakshmikantha Rao Files Nomination today | Sakshi
Sakshi News home page

'ఢిల్లీలో నాకు చాలామందితో సత్సంబంధాలున్నాయి'

Published Tue, May 31 2016 1:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

న్యూఢిల్లీలో నాకు చాలామందితో సత్సంబంధాలున్నాయని టీఆర్ఎస్ నాయకుడు డిఎస్ తెలిపారు.

హైదరాబాద్ : న్యూఢిల్లీలో నాకు చాలామందితో సత్సంబంధాలున్నాయని టీఆర్ఎస్ నాయకుడు డిఎస్ తెలిపారు. ఆ పరిచయాలను తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ కార్యాలయంలో డీఎస్తోపాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం వారిద్దరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

అలాగే టీఆర్ఎస్ పార్టీ మరో నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ... బంగారు తెలంగాణ కోసం నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి కెప్టెన్ లక్ష్మీకాంతరావు కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావును తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తుది గడువు మంగళవారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వారిద్దరు నేడు నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 11వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement