
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓ బీజేపీ ఎమ్మెల్యే అంబులెన్స్‌లో వచ్చారు. ఈ ఘటన శుక్రవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మతార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసరిసిన్హ్ జెసాంగ్‌భాయ్ సోలంకి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అయితే నేడు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఆయన హాస్పిటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరారు. అంబులెన్స్‌లో అసెంబ్లీకి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, 8 రాష్ట్రాల్లో 19 స్థానాలకు నేడు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో 4 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కొద్దిసేపటి కిత్రం ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment