సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 6 నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
అయితే నామినేషన్లకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ కోసం 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాల్సి ఉండగా, స్వతంత్రులు 10 మంది ఎమ్మెల్యేలను ప్రతిపాదకులుగా చేయాల్సి ఉంటుంది. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ అలీ ఖాన్, టీ సుబ్బిరామిరెడ్డి, కే కేశవరావు, తోట సీతారామ లక్ష్మిల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం రానుంది.
Comments
Please login to add a commentAdd a comment